శ్రీవారి బ్రహ్మోత్సవాలతో ఆంధ్ర హెలీటూరిజం మొదలు

First Published Aug 31, 2017, 1:51 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ హెలీ టూరిజం శకం మొదలవుతున్నది. ఎపి పర్యాకట శాఖ ఒక ప్రయివేటు కంపెనీతో కలసి తిరుపతి నుంచి చంద్రగిరి హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభించబోతున్నది

 

 

ఆంధ్రప్రదేశ్   హెలీ టూరిజం యుగం మొదలువుతూ ఉంది. ఇక నుంచి ఆకాశంలో ఎగురుతూ ఆంధప్రదేశ్ ఆందాలను అస్వాదించ వచ్చు. ఇది సెప్టెంబర్ మూడో వారంలో మొదలవుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలతో ప్రారంభమవుతూ ఉంది. అయితే, ఇది పైలట్ ప్రాజక్టు మాత్రమే. ఇది విజయవంతమవడం మీద విస్తరణ అవకాశాలుంటాయి. ఆంధ్ర ప్రదేశ్  పర్యాటకశాఖ మ్యాక్‌ ఏరో స్పేస్ అండ్ ఏవియేషన్‌ (ఢిల్లీ) లు హెలీటూరిజానికి శ్రీకారం చుడుతున్నాయి.  మొదట 6 సీట్ల బెల్ 206 ఎల్ 4 హెలీకాప్టర్‌ ద్వారా యాత్రికులకు తిరుపతి చుట్టూరు ఉన్నవిహారయాత్రలు, పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పిస్తారని అధికారులు చెప్పారు.  దీనికోసం తిరుపతి బస్టాండ్‌ సమీపంలో హెలీపాడ్ ఏర్పాటుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి శ్రీనివాసం వసతి సముదాయం వెనుక ఉన్న  స్థలంలో బహుభా తాత్కాలిక హెలీప్యాడ్ ఏర్పాటు కావచ్చని తెలిసింది. ఇక్కడ మూడెకరాల ఈ స్థలం రాకపోకలకు అనువుగా ఉందని వారు భావిస్తున్నారు. టూరిజం అధికారులు పౌరవిమాన శాఖ నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఒకటిరెండు రోజుల ఈ క్లియరెన్స్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఎపి టూరిజం శాఖకు, మాక్ సంస్థకు జూలైలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, విజయవాడ, విశాఖ తిరుపతి లు హెలిటూరిజానికి అనువైనవిగా గుర్తించారు. ఇది ఇపుడు బ్రహ్మోత్సవాలతో మొదలవుతుంది. ఇది ఇలాంటే , హెలికాప్టర్ టికెట్ ధరను కూడా సాధ్యమయినంతవరకు అందుబాటులో ఉంచేలా చేస్తున్నారు.  టికెట్ రు. 2500 ఉండవచ్చని అనుకుంటున్నారు.  ఒక్కొక్క ట్రిప్పులో 12 నుంచి 20 నిమిషాల పాటు హెలికాప్టర్ గాలిలో ఎగురుతుంది. మొదటి పర్యాకట ఆకర్షణగా చంద్రగిరిని రూపొందిస్తున్నారు.అంటే తిరుపతి నుంచి హెలికాప్టర్ చంద్రగిరి వెళుతుంది. ఈ పైలట్ ప్రాజక్టు విజయవంతమయితే, హెలీ టూరిజం పర్మనెంటు గా నడపేందుకు చర్యలు తీసుకుంటారు.

click me!