మా పప్పు ఎలాంటిదంటే: లోకేష్ పై కళా వెంకట్రావు కామెంట్స్

By Arun Kumar PFirst Published Jun 15, 2020, 9:32 PM IST
Highlights

స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అవినీతి దిబ్బపై కూర్చొని అంబటి రాంబాబు లాంటి చోటా అవినీతి  పరుల ద్వారా వీధినపోయే ఊరి జనంపై పేడ వేయిస్తున్నారని ఏపి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు.

అమరావతి: స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అవినీతి దిబ్బపై కూర్చొని అంబటి రాంబాబు లాంటి చోటా అవినీతి  పరుల ద్వారా వీధినపోయే ఊరి జనంపై పేడ వేయిస్తున్నారని ఏపి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. జైలుకు పోయిన తరువాత కూడా అవినీతి అలవాటు మానుకోకపోగా ఊరంతా అనినీతి పరులేనని గావుకేక తీసి తమ అపరాధ బావనను కప్పి పెట్టుకొనే విన్యాసం చేస్తున్నారంటూ జగన్ పై మండిపడ్డారు. 

''అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నిస్సిగ్గుగా 108 వాహనాలను ఏ2 విజయసాయిరెడ్డి వియ్యంకుడి సంస్థ అరబిందో కు అధిక రేటుకు కట్టబెట్టారు. ఒక వాహనానికి సర్వీసు ప్రొవైడర్ నెలకు రూ.1.31లక్షలు ఇవ్వగా దాన్ని జగన్ ప్రభుత్వం రూ.2.21 లక్షలకు పెంచి ఇవ్వడం అవినీతి  కాదా?'' అని నిలదీశారు. 

''రూ.1300కోట్లు విలువైన 613హెక్టార్ల సున్నపురాయి గనులను జగన్ సొంత కుటుంబానికి కట్టబెట్టడం అనినీతి, అధికార దుర్వినియోగం కాదా రాంబాబు. వైకాపా ప్రజా ఆదరణ కలిగిన పార్టీ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశాన్ని, ప్రతిపక్షాల్ని ఎందకు నామినేషన్లు వేయకుండా అరాచకం  సృష్టించారు? తెలుగుదేశం నాయకులపై వందల అక్రమ కేసులు పెట్టారు. నిష్పక్ష పాతంగా వుండే ఎన్నికల కమిషనర్ అంటే ఎందుకు భయపడుతున్నారు'' అని అడిగారు. 

read more  చంద్రబాబు కొడుకు.. బాలయ్య అల్లుడు, ఈ రెండూ తీసేస్తే నువ్వేంటి: లోకేశ్‌పై అంబటి వ్యాఖ్యలు

''లోకేష్ గ్రామాణాభివృద్ది శాఖా మంత్రిగా తక్కువ సమయంలో 24వేల కి.మీ రోడ్లు వేశారు. ఐటీ మంత్రిగా అనేక సాప్ట్ వేరు కంపెనీలు తెచ్చి 30వేలు కొత్త ఉద్యోగాలు కల్పించారు. వైకాపాలా ఉన్నవి పోగొట్టం సమర్ధతకు నిదర్శనమా?'' అంటూ లోకేష్ పై అంబటి చేసిన విమర్శలను కళా తిప్పికొట్టారు. 

''సమర్ధతకు భయపడే కదా రోజూ వైకాపా నేతలు లోకేష్ జపం చేస్తున్నది. మా పప్పు బలవత్తరమైన ప్రొటీన్  ప్రజలకు ఇస్తున్నది. మీ గన్నేరు పప్పు ప్రజల ప్రాణాలు తీస్తున్నది. రాష్ట్రాని అల్లకల్లోలం చేస్తున్నది. ప్రాణాలు తీసి ప్రాణాలు  పొగొట్టుకొన్న రాజారెడ్డితో మేము సరితూగం... కాబట్టి రాంబాబు విమర్శను మేము అంగీకరిస్తాం'' అని ఎద్దేవా చేశారు. 

''వైకాపా అవినీతిపై ప్రజా వ్యతిరేక చర్యలు సరిదిద్దుకొనే స్థొమత కోల్పొయి... దినదిన ప్రవర్ధమానమవుతున్న టీడీపీని చూసి ప్రస్టేషన్ కు గురై అచ్చెన్నాయుడు, జేసి కుటుంబంపై అక్రమ అరెస్టులు చేశారని లోకమంతా కోడైకుస్తున్నది. వైకాపా అబద్దాలను ఇంకా వినే స్థితిలో ప్రజలు లేరని గుర్తించండి'' అని హెచ్చరించారు. 

''రూ.7.96కోట్లు పనికి కేవలం సిఫార్సు లేఖ ఇచ్చినందకు అచ్చెన్నాయుడుని అరెస్టు చేస్తే...రూ.3కోట్లు బిల్లు ఇచ్చినందకు వైకాపా మంత్రిని ఏం చేస్తారా? వోక్స్ వ్యాగన్ కు రూ.10కోట్లు చెల్లించినందుకు బొత్సాను అరెస్టు చేస్తారా? రూ.1300కోట్ల విలువైన  గనులు తీసుకొన్న భారతి సిమెంట్ డైరక్టర్ ఏం చేస్తారా?  10 వాహనాలను పొందిన విజయసాయిరెడ్డి అల్లుడి కంపెని కూడా అరెస్టు చేస్తారా?'' అంటూ సీఎం జగన్, వైసిపి నాయకులపై కళా వెంకట్రావు మండిపడ్డారు. 

click me!