అధికారం శాశ్వతం కాదు... జగన్ గారు గుర్తుంచుకోండి: కళా వెంకట్రావు హెచ్చరిక

By Arun Kumar PFirst Published Aug 7, 2020, 9:51 PM IST
Highlights

ప్రభుత్వ చేతకాని పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే టిడిపి నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు.

గుంటూరు: ప్రభుత్వ చేతకాని పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే టిడిపి నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. 

''రాష్ట్రాన్ని మనుషులు పాలిస్తున్నారా?  రాక్షసులు పాలిస్తున్నారా? బెయిల్ పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని  24 గంటలు గడవక ముందే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టించి మళ్లీ అరెస్టు చేయించింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని అన్నారు. 

''రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మీ పార్టీకొక నిబంధనలు, విపక్ష నాయకులకొక నిబంధనలా? అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన జేసీ ప్రభాకర్  రెడ్డిని వెంటనే విడుదల చేయాలి'' అని కళా డిమాండ్ చేశారు. 

read more   జేసీ ప్రభాక‌ర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి తిరిగి అరెస్ట్... జగన్ కు చంద్రబాబు హెచ్చరిక

''పాలనా వైఫల్యాను కప్పిపుచ్చుకునేందుకే వైసిపి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి ప్రజల దృష్టిని మళ్లించే దుస్థితికి దిగజారింది. ప్రభాకర్ రెడ్డిని, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అరెస్టులు చేసి వేధిస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగానికి భవిష్యత్ లో ప్రజలే బుద్ధి చెబుతారు'' అని హెచ్చరించారు.  

''ఇంతటి రాక్షస పాలన దేశంలో ఎక్కడా లేదు.  కరోనా నివారణపై జగన్ రెడ్డి ప్రభుత్వం పెట్టే శ్రద్ధ కంటే టీడీపీ నేతలపై ఏవిధంగా అక్రమ కేసులు పెట్టాలో ఆలోచిస్తోంది. రాష్ట్రానికి జగన్ రూపంలో శని పట్టింది. టీడీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా జగన్ పాలన చేస్తున్నారు. కక్ష్య సాధింపు రాజకీయాలు రాష్ట్రానికి మంచివి కావు'' అని కళా వెంకట్రావు సూచించారు. 

click me!