
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవి కాలం పొడిగింపుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సెప్టెంబర్ 30న ఆమె పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
1984 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన నీలం సాహ్ని నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా సీఎస్. ఎల్‌వీ సుబ్రమణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయడంతో ఆయన స్థానంలో నీలం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.