
ఆంధ్రప్రదేశ్‌లో తొలి నుంచి బలహీనవర్గాలకు అండగా నిలిచింది టీడీపీయే అన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. బలహీనవర్గాలకు వివిధ పథకాలు టీడీపీ హయాంలోనే తీసుకొచ్చామని.. రాష్ట్ర జనాభాలో అత్యధికులు బీసీలేనని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. రాజకీయ పార్టీలు వేరైనా అందరూ కలిసికట్టుగా వుండాలని , తెలుగుదేశం పార్టీ అధికారంలో, ప్రతిపక్షంలో వున్నా ఐకమత్యంతో వుందన్నారు. బలహీన వర్గాలు ఎదగాలని .. సీఎం జగన్‌కు బలహీనవర్గాలంటే కోపమని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం వైపే వుంటారని, నాలుగేళ్లలో 54 కార్పోరేషన్లు ఇచ్చినా, ఒక్క పైసా నిధులివ్వలేదన్నారు. ఈ ప్రభుత్వవంపై బలహీన వర్గాల తరపున మాట్లాడితే మాపై కేసులు అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు చట్టసభల్లో అవకాశం కల్పించేందుకు తెలుగుదేశం కృషి చేస్తుందని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. మీ అందరి సలహాలు తీసుకుని మ్యానిఫేస్టో రూపొందిస్తామని ఆయన తెలిపారు.
ALso Read: చంద్రబాబు ఆదేశిస్తే విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ.. కేశినేని చిన్ని
కాగా.. తెలుగుదేశం నేత కేశినేని శివనాథ్ (చిన్ని) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తాను విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలుస్తానని చెప్పారు. అయితే టికెట్ తనకిచ్చినా, వేరే ఎవరికైనా ఇచ్చినా.. పార్టీ అభ్యర్థిని గెలిపించి తీరుతామని తెలిపారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయటమే అజెండాగా అందరం కలిసి పని చేస్తున్నామన్నారు. అయితే ప్రస్తుతం విజయవాడ నుంచి ఎంపీగా టీడీపీ నేత కేశినేని నాని ఉన్నారు. కేశినేని శివనాథ్‌కు కేశినేని నాని సోదరుడు అవుతారనే సంగతి తెలిసిందే.
కేశినేని చిన్నితో పాటు జిల్లాకు కొందరు టీడీపీ నేతలతో కేశినేని నానికి విభేదాలు ఉన్నాయి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తదితర టీడీపీ నేతలతో కలిసి కేశినేని నాని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సోదరుల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో టీడీపీ అధిష్టానానికి, కేశినేని నానికి మధ్య దూరం పెరిగిందనే వార్తలు కూడా ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టికెట్ల విషయంలో టీడీపీ అధిష్టానం టికెట్ల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.