వైఎస్ వివేకా హత్య: ముగిసిన వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ, రూ. 40 కోట్ల డీల్ పై ఆరా

By narsimha lode  |  First Published Apr 19, 2023, 4:22 PM IST

కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  విచారణ  ముగిసింది.  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో   వైఎస్ అవినాష్ రెడ్డిని  సీబీఐ  ఇవాళ  విచారించింది. 


హైదరాబాద్:  కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  ఐదు గంటల పాటు  సీబీఐ  అధికారులు   విచారించారు. బుధవారంనాడు  ఉదయం   10 గంటలకు  వైఎస్ అవినాష్ రెడ్డి   సీబీఐ విచారణకు  హాజరయ్యారు.  ఐదో దఫా  సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి  హాజరయ్యారు.  వైఎస్ అవినాష్ రెడ్డి  ఇచ్చిన  సమాచారం ఆధారంగా  వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డిలను   సీబీఐ  విచారించింది.

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  రూ. 40 కోట్లు డీల్ ఉందని  దస్తగిరి  వాంగ్మూలం  ఇచ్చారు. ఈ  డీల్ గురించి సీబీఐ అధికారులు ప్రశ్నించారని సమాచారం. మరో వైపు  సునీల్ యాదవ్ కు  కోటి రూపాయాలు  ఎవరు బదిలీ  చేశారనే   విషయమై  
సీబీఐ  ప్రశ్నించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  అరెస్టైన  వైఎస్ భాస్కర్ రెడ్డి,  ఉదయ్ కుమార్ రెడ్డిలను  సీబీఐ కస్టడీకి  కోర్టు  ఇచ్చింది. ఆరు రోజుల పాటు కస్టడీకి  ఇస్తూ  కోర్టు  నిన్న  ఆదేశాలు  జారీ చేసింది.  దీంతో  ఇవాళ   ఈ ఇద్దరిని  కూడా  సీబీఐ అధికారులు విచారించారు.  

Latest Videos

undefined

వైఎస్ అవినాష రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను  వేర్వేరుగా  సీబీఐ  అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ ముగ్గురిని  సుమారు గంటన్నరపాటు  కలిపి ప్రశ్నించారు. విచారణ  ప్రక్రియను  సీబీఐ రికార్డు చేసింది.  ఆడియో,వీడియోను  రికార్డు చేయాలని  ఆదేశాలు జారీ చేసింది.  సీబీఐ  కార్యాలయం నుండి   వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను  సీబీఐ  అధికారులు  చంచల్ గూడ జైలుకు తరలించారు

మరో వైపు  నిందితులకు  వైఎస్ అవినాష్ రెడ్డిలకు  ఉన్న సంబంధాలపై  సీబీఐ అధికారులు  ఆరా తీశారని సమాచారం.  గూగుల్ టేకవుట్  డేటా  ఆధారంగా  సీబీఐ  అధికారులు  ముగ్గురిని  ప్రశ్నించారని  తెలుస్తుంది. నిందితులు  వైఎస్ భాస్కర్ రెడ్డి  ఇంటికి ఎందుకు  వచ్చారనే   విషయమై సీబీఐ అధికారులు  ఆరా తీశారు. 

also read:వైఎస్ వివేకా హత్య కేసు: ఐదోసారి సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి

ఇవాళ  ఉదయం  10 గంటలకు  వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు  హాజరయ్యారు.  ఈ నెల  17, 18 తేదీల్లో  వైఎస్ అవినాష్ రెడ్డిని  సీబీఐ విచారించలేదు.  హైకోర్టులో  కేసున్నందున  సీబీఐ విచారణ  జరగలేదు.సబీఐ అధికారులు   ఇచ్చిన నోటీసు మేరకు  ఇవాళ  ఉదయం  అవినాష్ రెడ్డి  విచారణకు హాజరయ్యారు.

click me!