దేవినేని ఉమతో వల్లభనేని వంశీకి విభేదాలు: చంద్రబాబు లేఖలో ప్రస్తావన

By narsimha lode  |  First Published Oct 28, 2019, 3:45 PM IST

గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని వంశీకి మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావుకు మధ్య విభేదాలు ఉన్నాయి. సోమవారం నాడు చంద్రబాబునాయుడుకు రాసిన లేఖలో ఈ విషయాన్ని కూడ  పరోక్షంగా  వల్లభనేని వంశీ ప్రస్తావించారు.


విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావుకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య అంతరం ఉంది. సోమవారం నాడు చంద్రబాబునాయుడుకు  రాసిన లేఖలో కృష్ణా జిల్లా పార్టీ పట్టించుకోలేదని  వల్లభనేని వంశీ ఆరోపించారు. ఈ విమర్శలపై వల్లభనేని వంశీ పరోక్షంగా  మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావుపై తన మనసులో మాటను బయట పెట్టారు.

Also read:వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ.. పార్టీలోనే ఉంటారు: కేశినేని నాని

Latest Videos

undefined

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన టీడీపీ విజయవాడ సిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా  మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఉన్నాడు. టీడీపీ విజయవాడ సిటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వల్లభనేని వంశీ కాంగ్రెస్ పార్టీ నేతలతో కయ్యానికి కాలు దువ్వారు.

Also read:వల్లభనేని వంశీ రాజీనామా: బుజ్జగింపులకు చంద్రబాబు కమిటీ

విజయవాడ సిటీ కమిషనర్‌గా పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారితో వల్లభనేని వంశీ దూకుడుగా విమర్శలు చేశారు.ఆ సమయంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రుపై టీడీపీనేత వల్లభనేని వంశీ విమర్శలు చేశారు.

Also Read:ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్: జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ వెనుక నాని

ఆ సమయంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రును టీడీపీలోకి తీసుకొచ్చేందుకు  దేవినేని ఉమ మహేశ్వరరావు ప్రయత్నించారని వల్లభనేని వంశీ ఆ సమయంలో పార్టీలో తన సన్నిహితుల వద్ద చెప్పేవారు.దేవినేని నెహ్రుకు వల్లభనేని వంశీకి మద్య పొసగలేదు. ఈ కారణంగానే వల్లభనేని వంశీ దేవినేని నెహ్రును పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకించినట్టుగా సమాచారం.

Also Read: అండగా ఉంటా, అది సరైంది కాదు: వల్లభనేని వంశీకి బాబు ధైర్యం

అయితే  2014  ఎన్నికల తర్వాత దేవినేని నెహ్రు తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. దేవినేని నెహ్రు తనయుడు దేవినేని అవినాష్ ప్రస్తుతం తెలుగు యువత ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  కొనసాగుతున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానంలో దేవినేని అవినాష్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

Also Read: చంద్రబాబు లేఖకు వల్లభనేని వంశీ జవాబు ఇదీ..

వల్లభనేని వంశీకి, దేవినేని ఉమ మహేశ్వరరావుకు ఆ  కాలంలో కొంత గ్యాప్ ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  దేవినేని ఉమ మహేశ్వరరావు జిల్లా నుండి మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో కూడ వల్లభనేని వంశీకి, మంత్రి దేవినేని ఉమకు మధ్య అంతరం కొనసాగిందనే ప్రచారం అప్పట్లో సాగింది.

Also Read: వల్లభనేని రాజీనామా వెనక వైఎస్ జగన్ వ్యూహం ఇదే...

ఆ తర్వాత కూడ  వీరిద్దరి మధ్య ఇదే అంతరం కొనసాగిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే వల్లభనేని వంశీ పరిమితమయ్యేవాడు. 

విజయవాడ సిటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ తర్వాత  ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడ చేసిన కొన్ని నిరసనల సమయంలో  కేసులు పెట్టారు. ఈ కేసుల సమయంలో జిల్లా పార్టీ పట్టించుకోలేదని వల్లభనేని వంశీ సోమవారం నాడు ఇవాళ చంద్రబాబుకు రాసిన లేఖలో విమర్శలు చేశారు.

 ఈ విమర్శలు పరోక్షంగా దేవినేని ఉమ మహేశ్వరరావుపై చేసినవనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తనను ప్రత్యర్ధులు ఇబ్బంది పెడుతున్న సమయంలో పార్టీ ఎందుకు పట్టించుకోలేదని వల్లభనేని వంశీ విమర్శలు చేశారు.

 
 

click me!