ఏపీలో ఖాళీగా ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు ఆయా స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలను సిద్దం చేయాలని పురపాలక శాఖను ఆదేశించింది.
అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహలు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు గాను ఓటర్ల జాబితాను సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి మున్సిఫల్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.
గతంలోని 11 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొందరు అభ్యర్ధులు మరణించారు. 8 పురపాలక, నగర పంచాయితీల్లోని పలు వార్డుల్లో కూడ గెలుపొందినవారు మరణించడంతో ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా మారింది.కోర్టు వివాదాలతో పాటు ఇతరత్రా కారణాలతో ఎన్నికలు నిర్వహించలేని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.
ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి,దాచేపల్లి, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, కుప్పం, బేతంచర్ల, కమలాపురం, పెనుకొండ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.ఈ మేరకు ఆయా స్థానిక సంస్థల పరిధిల్లో ఓటర్ల జాబితాను సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం.