AP Skill development scamలో చంద్రబాబుకు బెయిల్: రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By narsimha lode  |  First Published Nov 20, 2023, 3:13 PM IST


ఆంధ్రప్రదేశ్  స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  చంద్రబాబుకు ఊరట దక్కింది.  స్కిల్ కేసులో  ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్  మంజూరు చేసింది. అంతేకాదు  మధ్యంతర బెయిల్ షరతులు ఈ నెల 28 వరకే వర్తించనున్నట్టుగా హైకోర్టు తెలిపింది.



అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కేసులో  తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది.  ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ తీర్పునకు సంబంధించిన షరతులు వర్తిస్తాయని  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల  28వ తేదీన చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని హైకోర్టు సూచించింది. మరో వైపు ఈ నెల  29 నుండి  రాజకీయ ర్యాలీలు, సభల్లో  చంద్రబాబు పాల్గొనవచ్చని  హైకోర్టు తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ఏడాది  సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబునాయుడిని  ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో ఈ ఏడాది అక్టోబర్  31న  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అయితే  రెగ్యులర్ బెయిల్ పై చంద్రబాబు తరపు న్యాయవాదులు, ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విన్నది.  ఈ నెల 16వ తేదీన ఇరువర్గాలు తమ వాదనలను పూర్తి చేశారు.ఈ విషయమై  తీర్పును  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  సోమవారంనాడు వెల్లడించింది.

Latest Videos

undefined

చంద్రబాబునాయుడు ఆరోగ్య పరీక్షలు, చికిత్సకు సంబంధించిన నివేదికను  ఏసీబీ కోర్టులో అందించాలని ఏపీ హైకోర్టు సూచించింది. అంతేకాదు ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని కూడ  హైకోర్టు ఆదేశించింది.

also read:చంద్రబాబు గుండె సైజు పెరిగింది: ఏపీ హైకోర్టుకు హెల్త్ రిపోర్టు అందజేత

ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న  చంద్రబాబు నాయుడిని  సభలు, సమావేశాల్లో పాల్గొనకుండా  చేయాలని గతంలో ఉన్న నిబంధనల విషయమై కోర్టులో చర్చ జరిగింది. అయితే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్టీ సమావేశాల్లో పాల్గొనకుండా ఉండమని ఆదేశించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. రాజకీయ పార్టీల సభలు, సమావేశల్లో చంద్రబాబు నాయుడు ఈ నెల  29వ తేదీ నుండి పాల్గొనవచ్చని  హైకోర్టు స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును నిరసిస్తూ  చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై  ఇరు వర్గాల న్యాయవాదుల వాదలను పూర్తై  తీర్పు రిజర్వైంది. దీపావళి తర్వాత ఈ విషయమై తీర్పును వెల్లడించనున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించింది.  అయితే ఈ వారంలో ఈ పిటిషన్ పై  తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. 

click me!