ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం : పోలీసులు అదుపులో అనుమానిత యూట్యూబర్...

Published : Nov 20, 2023, 02:00 PM IST
ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం : పోలీసులు అదుపులో అనుమానిత యూట్యూబర్...

సారాంశం

ఆదివారం సాయంత్రం ఫిషింగ్ హార్బర్ లో లోకల్ బాయ్ నాని తన భార్య సీమంతం వేడుకలు నిర్వహించాడు. భార్య సీమంతం సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. 

విశాఖ పట్నం : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తిని విశాఖ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానించారు. అతని కోసం సోమవారం ఉదయం నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. 

ఎట్టకేలకు లోకల్ బాయ్ నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాని ఆదివారం సాయంత్రం ఫిషింగ్ హార్బర్ లో భార్య సీమంతం వేడుకలు నిర్వహించాడు. భార్య సీమంతం సందర్భంగా లోకల్ బాయ్ నాని తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడని సమాచారం. అగ్ని ప్రమాదానికి సంబంధించి పోలీసులు నానిని ప్రశ్నిస్తున్నారు. 

Fire at Vizag fishing harbour : వైఎస్ జగన్ రావాలి, న్యాయం చేయాలి. బాధిత కుటుంబాల ఆందోళన

మరోవైపు, షిప్పింగ్ హార్బర్ ప్రమాద ఘటనా స్థలికి మంత్రి సీదిరి అప్పలరాజు వచ్చారు. మత్స్యకార కుటుంబాలు  మంత్రి అప్పలరాజుని చుట్టుముట్టారు. 
తమకు తక్షణమే న్యాయం చేయాలని బాధిత కుటుంబాల డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితి చేయిదాటిపోకుండా మంత్రికి పోలీసులు చుట్టూ భద్రతగా నిలబడ్డారు. మంత్రిని కలవకుండా మత్స్యకార కుటుంబాలను నెట్టేస్తుండడంతో మత్స్యకార కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ఇదిలా ఉండగా, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 50 పడవల వరకు కాలి బూడిదయ్యాయి. కోట్లలో నష్టం వాటిల్లింది. బోట్లలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో  ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనపై లోతైన విచారణ జరపాలని తెలిపారు. మంత్రి సీదిరి అప్పలరాజును వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించాలని తెలిపారు. 

విశాఖ హార్బర్ లో అగ్ని ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఓ యూట్యూబర్ పై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. నిన్న రాత్రి ఫిషింగ్ హార్బర్లో లంగర్ వేసిన ఉన్న బోటులో ఓ యూట్యూబర్ పార్టీ ఇచ్చాడు. ఆ సమయంలో మద్యం మత్తులో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో యూట్యూబ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనలో అర్థరాత్రి గాఢ నిద్రలో ఉన్న గంగపుత్రులు అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయారనుకున్నారు. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాద ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లడంతో జాలర్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu
PSLV-C62 EOS-N1 Launch: ఇస్రో ప్రయోగంపై సైంటిస్టులు, స్టూడెంట్స్ రియాక్షన్ | Asianet News Telugu