మేం అన్ని రాష్ట్రాల్లా కాదు.... జీఎస్టీ బకాయిలపై కేంద్రాన్ని కోరనున్న ఏపీ సర్కార్

By Siva KodatiFirst Published Aug 29, 2020, 8:37 PM IST
Highlights

జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం నుంచి రాబట్టే అంశంపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. పరిహారం ఎంతవరకు రావాల్సి ఉందన్న అంశంపై ఆర్ధిక శాఖ మదింపు చేస్తోంది

జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం నుంచి రాబట్టే అంశంపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. పరిహారం ఎంతవరకు రావాల్సి ఉందన్న అంశంపై ఆర్ధిక శాఖ మదింపు చేస్తోంది.

ఈ ఏడాది జూన్ నాటికి రూ.4,656.28 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఆర్ధిక శాఖ తెలిపింది. ఇది ఆగస్టు నెలాఖరు నాటికి మొత్తం రూ.10 వేల కోట్లకు చేరవచ్చని అంచనా.

కరోనా ప్రభావంతో ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీల రెవెన్యూ చాలా వరకు పడిపోతోందని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కారణంగానే కేంద్రం నుంచి ఎక్కువ పరిహారం రావాల్సి ఉంటుందని ఆర్ధిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ఏపీని మిగిలిన రాష్ట్రాలతో పోల్చవద్దని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరనుంది. ఏపీ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని జగన్ సర్కార్ కేంద్రాన్ని కోరనుంది.

కేంద్రం చెప్పినట్లు రుణాలు తీసుకున్నా.. వాటి వడ్డీలకూ భారీ స్థాయిలో చెల్లింపులు జరపాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. పరిస్థితిని అర్థం చేసుకుని జీఎస్టీ పరిహారం బకాయిలు విడుదల చేసేలా... కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది. 

click me!