ఆ రెండు జిల్లాల్లో తగ్గని ఉద్థృతి: ఏపీలో కొత్తగా 10,548 కేసులు, 82 మరణాలు

Siva Kodati |  
Published : Aug 29, 2020, 06:57 PM ISTUpdated : Aug 29, 2020, 07:01 PM IST
ఆ రెండు జిల్లాల్లో తగ్గని ఉద్థృతి: ఏపీలో కొత్తగా 10,548 కేసులు, 82 మరణాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కి చేరుకుంది.

గత 24 గంటల్లో కరోనా కారణంగా 82 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 3,796కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 97,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

నిన్న ఒక్కరోజే 8,796 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 3,12,687కి చేరింది. గత 24 గంటల్లో 62,024 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 36,03,345కి చేరుకుంది.

కరోనా కారణంగా చిత్తూరు 15, నెల్లూరు 11, తూర్పు గోదావరి 8, పశ్చిమ గోదావరి 8, అనంతపురం 6, గుంటూరు 6, కర్నూలు 6, ప్రకాశం 5, విశాఖపట్నం 5, శ్రీకాకుళం 4, విజయనగరం 4, కడప 2, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజే తూర్పుగోదావరి జిల్లాలో 1,096 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురం 864, చిత్తూరు 813, గుంటూరు 635, కడప 991, కృష్ణ 362, కర్నూలు 791, నెల్లూరు 1,038, ప్రకాశం 870, శ్రీకాకుళం 522, విశాఖపట్నం 988, విజయనగరం 715, పశ్చిమ గోదావరిలలో 863 కేసులు వెలుగు చూశాయి., 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?