చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై అనుమానం: నివేదిక కోరిన నిమ్మగడ్డ

By narsimha lode  |  First Published Feb 5, 2021, 10:44 AM IST

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని ఈ రెండు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. అంతేకాదు ఈ జిల్లాల్లోని ఏకగ్రీవ పంచాయితీల వివరాలను ప్రకటించొద్దని కూడ ఎస్ఈసీ సూచించింది.


అమరావతి: చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని ఈ రెండు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. అంతేకాదు ఈ జిల్లాల్లోని ఏకగ్రీవ పంచాయితీల వివరాలను ప్రకటించొద్దని కూడ ఎస్ఈసీ సూచించింది.

గ్రామపంచాయితీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకొన్న గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది.తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో చిత్తూరులో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి.

Latest Videos

undefined

 

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని ఈ రెండు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది.

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఏకగ్రీవ ఎన్నికల విషయంలో అధికార పార్టీ తీరుపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ తన అధికారాన్ని ఉపయోగించుకొని బలవంతంగా ఏకగ్రీవాలకు పాల్పడుతోందని టీడీపీ, బీజేపీలు ఆరోపించాయి.

also read:ఏకగ్రీవాలపై రగడ.. పార్లమెంట్, అసెంబ్లీల్లో ఉంటాయా: నిమ్మగడ్డ వ్యాఖ్యలు

సాధారణ ఏకగ్రీవాలపై ఇబ్బందులు లేవని... అసాధారణ ఏకగ్రీవాలపై కేంద్రీకరిస్తామని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అసాధారణ ఏకగ్రీవాలు జరిగితే అధికారుల వైఫల్యమేనని కూడ ఆయన తెలిపారు.

ఇందులో భాగంగానే తొలివిడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయితీలపై ఎస్ఈసీ కేంద్రీకరించింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్టుగా ఎస్ఈసీ గుర్తించింది.

also read:ఆఖరి ప్రయత్నం కూడ అయిపోయింది, అంతిమ విజయం న్యాయానిదే: నిమ్మగడ్డ

ఈ రెండు జిల్లాల్లో అత్యధికంగా ఏకగ్రీవ ఎన్నికలు జరగడంపై ఎస్ఈసీ ఆరా తీసింది. ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తి చేసిన గ్రామాలకు సంబంధించి సమగ్ర నివేదికను ఇవ్వాలని ఎస్ఈసీ ఆదేశించింది. 

ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొంటామని కూడ ఎస్ఈసీ శుక్రవారం నాడు  ప్రకటించింది.
 

click me!