నిమ్మగడ్డతో కలిసి తిరుమలకు... తిరుపతి జేఇఓ బసంత్ కుమార్ పై వేటు

Arun Kumar P   | Asianet News
Published : Feb 05, 2021, 09:52 AM ISTUpdated : Feb 05, 2021, 10:10 AM IST
నిమ్మగడ్డతో కలిసి తిరుమలకు... తిరుపతి జేఇఓ బసంత్ కుమార్ పై వేటు

సారాంశం

తన పరిధిలో లేకపోయిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తిరుమల పర్యటన విషయంలో తిరుపతి  జేఇఓ బసంత్ కుమార్ అత్యుత్సాహం ప్రదర్శించినందుకు చర్యలు తీసుకుంది జగన్ సర్కార్. 

తిరుపతి:  నిన్న(గురువారం) ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో కలిసి తిరుమల పర్యటనలో  పాల్గోన్న తిరుపతి జేఇఓ బసంత్ కుమార్ పై జగన్ సర్కార్ సీరియస్ అయ్యింది. తన పరిధిలో లేకపోయిన ఎన్నికల కమిషనర్ పర్యటన విషయంలో బసంత్ కుమార్ అత్యుత్సాహం ప్రదర్శించినందుకు చర్యలు తీసుకుంటున్నారు. అతడిపై బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

నెల్లూరు జిల్లా ఎన్నికల అభ్జర్వర్ గా కోనసాగుతున్న బసంత్ కుమార్ ఎన్నికల విధులను విస్మరించి నిమ్మగడ్డ పర్యటనలో పాల్గొన్నారు. అతడి వ్యవహరశైలి పై ఆరా తీసిన ఇంటెలిజేన్స్ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. దీంతో వెంటనే అతడిపై వేటేశారు ఉన్నతాధికారులు. 

read more  పంచాయితీ ఎన్నికలు... శ్రీవారిని అదే కోరుకున్నా..: తిరుమలలో ఎస్ఈసీ

ఎస్ఈసి నిమ్మగడ్డ తిరుచానురు, తిరుమలలో దర్శన ఏర్పాట్లు పర్యవేక్షణ చేసేందుకు సంభందిత అధికారులు వున్నా బసంత్ కుమార్ ఆగమేఘాలు మీద నెల్లూరు నుంచి తిరుమలకు వెళ్లారు. ఇలా బసంత్ అత్యుత్సాహం పై ప్రభుత్వం సిరియస్ అయ్యింది. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిఏడిలో రిపోర్టు చేసింది. అయితే ఇలా బదిలీ వేటు పడ్డా పంచాయితీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా అభ్జర్వర్ గా కొనసాగవచ్చని ఆదేశాలల్లో పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే