రేపు లేదా ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
అమరావతి: రేపు లేదా ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.గురువారం నాడు మధ్యాహ్నం ఎన్నికల సంఘం కార్యాలయంలో ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. ఇవాళ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలో వెంకటేశ్వరస్వామని దర్శించుకొన్నారు.
also read:ఏపీలో స్థానిక సంస్థల ఎపిసోడ్: గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన రాజ్ భవన్ అధికారులు
అదే సమయంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. పశ్చిమగోదావరి జిల్లా నుండి ఎన్నికల సంఘం కమిషనర్ అమరావతికి చేరుకొన్నారు. ఎస్ఈసీ కార్యాలయంలో ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ అమలు విషయమై ఉద్యోగులతో చర్చిస్తున్నారు.
రాష్ట్రంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసే అవకాశం ఉంది.ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం కమిషనర్ ప్రకటించారు.