ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఎపిసోడ్‌ను గవర్నర్ బిశ్వభూషన్ దృష్టికి తీసుకెళ్లాయి రాజ్ భవన్ వర్గాలు.
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఎపిసోడ్‌ను గవర్నర్ బిశ్వభూషన్ దృష్టికి తీసుకెళ్లాయి రాజ్ భవన్ వర్గాలు.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను హైకోర్టు గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఏపీ హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ రంగం సిద్దం చేస్తున్నారు.ఎన్నికల నిర్వహణ, హైకోర్టు తీర్పు పరిణామాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసిన తర్వాత గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు.
రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలు హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించే విషయమై గవర్నర్ కు వివరించిన విషయం తెలిసిందే.
వచ్చే నెలలో నాలుగు విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ ప్రకటించారు. దీంతో ఈ నెల 23 నుండి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం లేకపోలేదు.