ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఎస్ఈసీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసింది.
అమరావతి: ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఎస్ఈసీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసింది.
ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపుగా వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ మంత్రిని ఆదేశించింది.వ్యక్తిగతంగా లేదా తన తరపున ప్రతినిధి ద్వారా కానీ వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకొంటామని ఎస్ఈసీ హెచ్చరించింది.
undefined
also read::లోకేష్ సర్పంచ్‌గా గెలిస్తే రాష్ట్రం వదిలిపోతా: మంత్రి కొడాలి నాని సవాల్
రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును మంత్రి కొడాలి నాని తప్పుబట్టారు. ఎస్ఈసీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇంటింటికి రేషన్ సరఫరాను నిలిపివేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను సాకుగా చూపి ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడంలో అర్ధం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న కార్యక్రమాలకు విపక్షాలు అడ్డు పడుతున్నాయన్నారు.
ఎన్నికల సంఘం తీరుపై కూడ మంత్రి దుమ్మెత్తిపోశారు. ఎన్నికల సంఘం వ్యవహరశైలిని కూడ మంత్రి తూర్పారబట్టారు. ఈ విషయాన్ని ఎస్ఈసీ సీరియస్ గా తీసుకొంది. ఈ వ్యాక్యలపై ఎస్ఈసీ శుక్రవారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
.