తెలంగాణ ఉద్యమం తరహాలోనే...స్టీల్ ప్లాంట్ కోసం మిలియన్ మార్చ్: గంటా పిలుపు

By Arun Kumar PFirst Published Feb 12, 2021, 11:16 AM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటికే తాను రాజీనామా చేయగా అది స్పీకర్ ఫార్మాట్ లో లేదు అని అంటున్నారని గుర్తుచేశారు. అందువల్లే రాజీనామా సరైన రీతిలో చేసి మరోసారి స్పీకర్ ఫార్మాట్ లో ఇస్తున్నానని అన్నారు.

విశాఖలోనే ఎదిగాను... ఇక్కడే బ్రతుకుతున్న వ్యక్తిని... అందుకే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసానని మాజీ మంత్రి, స్థానిక టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అన్నారు. అయితే ఇప్పటికే తాను రాజీనామా చేయగా అది స్పీకర్ ఫార్మాట్ లో లేదు అని అంటున్నారని గుర్తుచేశారు. అందువల్లే రాజీనామా సరైన రీతిలో చేసి మరోసారి స్పీకర్ ఫార్మాట్ లో ఇస్తున్నానని అన్నారు. మీ ముందే రాజీనామా లేఖను ఇస్తాను....నా రాజీనామా అమోదించాలి అని ప్రజలముందే గంటా స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర ప్రజల గుండె చప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అన్నారు. ఈ రోజు నుంచి నిరాహార దీక్షలకు దిగారని... ఇందులో తనను భాగస్వామిని చేయడం ఆనందదాయకమన్నారు. వెస్ట్ బెంగాల్ లో సింగూరు... విశాఖలో జిందాల్ పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేసి అడ్డుకున్నారని... వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలని గంటా సూచించారు. 

విశాఖ ఉక్కు ఉద్యమం: స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా

''తెలంగాణ ఉద్యమం తరహాలో ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉండాలి. ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసేది కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీనే. మీతో అండగా నిలుస్తాను. ప్రభుత్వం ఈ విషయంపై అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి. అఖిలపక్షం కమిటీ ఏర్పాటు చేసి ప్రధానిమంత్రి  కలిసే భాద్యత తీసుకోవాలి'' అని గంటా డిమాండ్ చేశారు. 

''మిలీనియం మార్చ్ ను నిర్వహించాలి, ఒక ప్రజా ఉద్యమంగా తీర్చి దిద్దాలి.  స్టీల్ ప్లాంట్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి'' అని పిలుపునిచ్చారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న రిలే నిరాహారదీక్ష శిబిరం వద్దే మరోసారి రిజైన్ చేసి, మీడియా ప్రతినిధులు సమక్షంలో లేఖ అందజేశారు గంటా శ్రీనివాసరావు. 

click me!