జగన్ చెప్పినట్లే చేసిన టీడీపీ నేత: కేబినెట్ హోదా పదవికి గుడ్ బై

By Nagaraju penumalaFirst Published Nov 29, 2019, 10:35 AM IST
Highlights

జగన్ నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలు పాటిస్తున్నారో లేదో తెలియదు గానీ తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత మాత్రం పాటించారు. జగన్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న ఆయన టీడీపీ హయాంలో లభించిన పదవికి ముందు రాజీనామా చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. 

ఎవరైనా వైసీపీలో చేరాలనుకుంటే పార్టీకి, పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరాలని స్పష్టం చేశారు. దాంతో అప్పటి వరకు వైసీపీలో చేరాలనుకునే టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం వెనకడుగు వేశారు. 

జగన్ నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలు పాటిస్తున్నారో లేదో తెలియదు గానీ తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత మాత్రం పాటించారు. జగన్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న ఆయన టీడీపీ హయాంలో లభించిన పదవికి ముందు రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 

బ్రేకింగ్ న్యూస్... ఏపి ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ రాజీనామా.

ఇంతకీ ఆనేత ఎవరంటే ఏపీ ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ. నేడు శుక్రవారం సీఎం జగన్ సమక్షంలో 3:30 గంటలకు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 
కారెం శివాజీతోపాటు తొమ్మిది మంది వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

తొమ్మిది మంది వైసీపీలో చేరేందుకు సీఎం జగన్ ఇప్పటికే అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఏపీఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పని చేసిన కారెం శివాజీ ఈనెల 28న తన పదవికి రాజీనామా చేశారు. 

తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శికి వేరువేరుగా రాజీనామా లేఖలు అందజేశారు. అనంతరం శుక్రవారం ఆయన వైసీపీలో చేరనున్నారు. 

చంద్రబాబుకు షాక్: జగన్ కు జై కొట్టిన టీడీపీ నేత, కుర్చీ కోసమేనా ......?

click me!