అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా... టిడిపి మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్

By Arun Kumar PFirst Published Nov 21, 2021, 7:54 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, టిడిపి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ మరోసారి అరెస్టయ్యారు. సోదరుడి ఇంట్లో నిద్రిస్తున్న కూనను అర్దరాత్రి పోలీసులు అరెస్ట్ చేసారు. 

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శ్రీకాకుళం జిల్లా టిడిపి అధ్యక్షులు కూన రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. srikakulam పట్టణంలోని శాంతినగర్ కాలనీలో సోదరుడి ఇంట్లో కూన తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో శనివారం రాత్రి కూన నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

గతంలో పోలీసులను దూషించిన కేసులో kuna ravikumar ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ తర్వాత ఆయనను పోలీసులు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. అరెస్ట్ చేసే సమయంలో కుటుంబసభ్యులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేసారని... అర్ధరాత్రి ఇంట్లోకి దూరి అరెస్ట్ చేయడం దారుణమని కూన సోదరుడు ఆందోళన వ్యక్తం చేసారు. 

కూన రవికుమార్ పై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. పలుమార్లు ఆయన అరెస్టవగా మరికొన్నిసార్లు ముందస్తు బెయిల్ పొంది అరెస్ట్ నుండి తప్పించుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఆయన అరెస్టవడం శ్రీకాకుళం టిడిపిలో అలజడి రేపింది. 

read more  Nandamuri Balakrishna: బాలయ్య ఇంటి వద్ద మీడియాకు అనుమతి నిరాకరణ (వీడియో)

గతంలో స్థానికసంస్థల ఎన్నికల సమయంలోనూ కూన రవికుమార్ అరెస్టయ్యారు. పరిషత్ ఎన్నికల రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త మురళీకృష్ణపై కూన రవి కుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కూన రవి కుమార్ అక్కడ ఉండగానే ఆ సంఘటన చోటు చేసుకుంది. దానికితోడు కూన రవి కుమార్ పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మురళీకృష్ణ పొందూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

దీంతో ఆయనపై కేసు నమోదు చేయడంతో కూన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత స్వయంగా ఆయనే పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కూనను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. 

ఇక ఓ తహసీల్దార్ విధులను ఆటంకం కలిగించడమే కాదు దుర్భాషలడుతూ బెదిరించాడన్న అభియోగాలపై కూడా కూన అరెస్టయ్యారు. పొందుగుల తహిసిల్దార్ తామరాపల్లి రామకృష్ణ అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ గొరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జెసీబీలను, నాలుగు టిప్పరను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక తవ్వుతుండగా రామకృష్ణ అక్కడికి చేరుకుని వాటిని సీజ్ చేశారు. 

read more   'ఒరేయ్ నాని, వంశీ జాగ్రత్తగా ఉండండి.. గాజులు తొడుక్కుని కూర్చోలేదు'.. నందమూరి రామకృష్ణ వార్నింగ్..

అయితే తన సోదరుడి వాహనాలనే సీజ్ చేస్తావా అంటూ కూన రవికుమార్ తహసీల్దార్ ను దుర్భాషలాడుతూ బెదిరించాడు. దీంతో తన విధులకు ఆటంకం కలిగిస్తూ బెదిరించాడంటూ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ సమయంలో కూడా నాలుగు రోజులుగా అజ్ఢాతంలో ఉన్న రవికుమార్ ఆ తర్వాత ఆయనే పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. 

ఇదిలావుంటే బుజ్జిలి ఎంపీడీవో దామోదరరావు ను బెదిరించారంటూ కూపైకేసు నమోదయినా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో అరెస్ట్ నుండి తప్పించుకున్నారు. లేదంటే ఈ కేసులో కూడా ఆయన అరెస్టయ్యేవాడే.  


 


 

click me!