సుజనా ఊరికినే అనలేదు: గోడదూకనున్న 11మంది టీడీపీ ఎమ్మెల్యేలు

By Nagaraju penumala  |  First Published Nov 25, 2019, 10:45 AM IST

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కండీషన్లు పెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారట. ఇప్పటి వరకు 11 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సన్నద్ధమయ్యారట. వీరంతా గత రెండు నెలలుగా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.  
 


అమరావతి: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బీజేపీతో టీడీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ విషయం ఏంటో తెలియదు గానీ టీడీపీ విషయంలో మాత్రం అది నిజమేనంటూ ప్రచారం జరుగుతుంది. టీడీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదంటూ ప్రచారం జరుగుతుంది. 

Latest Videos

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ వైసీపీని వీడే ఛాన్స్ లేదన్నది నగ్న సత్యం. ఇకపోతే కేంద్రం కూడా వైసీపీతో సఖ్యతగా ఉంటున్న తరుణంలో బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం ఎంపీలకు సైతం లేదు. అయితే ఎన్నికల సమయానికి సుజనా చేసిన లీకులు వైసీపీలో కూడా నిజమయ్యే ఛాన్స్ ఉండొచ్చు. 

సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం: 15 విమానాలు, రాజకీయాలకు వేదిక?

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం లేకపోవడంతో టీడీపీ నేతలు ఆసక్తిగా గోడదూకేందుకు ఎదురుచూస్తున్నారట. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం వచ్చీ రాగానే టీడీపీకి చెందిన ప్రజావేదికను కూల్చివేయడం, టీడీపీ నేతలు కేసులు ఇరుక్కోవడంతో పలువురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలని భావించారు. 

టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడాన్ని సీఎం జగన్ స్వాగతించారు కానీ కండీషన్స్ అప్లై అంటూ  ఓ మెలిక పెట్టారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తేనే వైసీపీలో చేర్చుకుంటామంటూ హెచ్చరించారు. 

ముప్పుతిప్పలు పడి ఎలాగోలా ఎన్నికల్లో గెలిస్తే ఆ ఎమ్మెల్యే పదవిని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తుంటే రాజీనామా చేసి రమ్మంటారా అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కి వెళ్లిపోయారట. తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మాత్రమే వైసీపీలో చేరేందుకు ప్రస్తుతం రెడీ అయ్యారు. 

వైసీపీలోకి సుజనా, ఎందుకు ఆగారంటే...: ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కండీషన్లు పెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారట. ఇప్పటి వరకు 11 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సన్నద్ధమయ్యారట. వీరంతా గత రెండు నెలలుగా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.  

బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తనయుడు నిశ్చితార్థానికి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు రోజులకు ముందే మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు దుబాయ్ లోనే తిష్టవేసినట్లు తెలుస్తోంది. పేరుకే నిశ్చితార్థానికి వెళ్లారని కానీ అసలు లోగుట్టు మాత్రం బీజేపీలో చేరే అంశంపై చర్చించుకునేందుకేనంటూ ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. 

కొడుకు నిశ్చితార్థం: పవన్ పాటలకు స్టెప్పులేసిన సీఎం రమేష్

ఇకపోతే ఎంపీ సీఎం రమేశ్ తనయుడి వివాహ నిశ్చితార్థానికి ఏపీ నుంచి చాలా మంది రాజకీయ ప్రముఖులు వెళ్లారు. వారిలో మొత్తం 75 మందికి పైగా ఎంపీలు సైతం ఉన్నారని తెలుస్తోంది. వెళ్లిన వారిలో ఇతర పార్టీలకు చెందిన వారు ఉన్నప్పటికీ టీడీపీకి చెందిన వారు వెళ్లడంతో వారిపైనే ఎక్కువగా ప్రచారం జరుగుతుంది.

వైసీపీలో అలజడి: వదిలేది లేదంటున్న జగన్, సుజనా చౌదరిపై పెద్దప్లానే

దుబాయ్ కేంద్రంగా టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారట. టీడీపీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడం ద్వారా తమ విలీనాన్ని గుర్తించాలని కోరే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం వెనుక ఉన్న భోగట్టా అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  

20 మంది టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు టచ్‌లో: సుజనా సంచలనం

click me!