బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన కొడుకు రిత్విక్ నిశ్చితార్థాన్ని పురస్కరించుకొని డ్యాన్స్ చేశాడు.
దుబాయ్:బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన కొడుకు నిశ్చితార్థ వేడుకను పురస్కరించుకొని ఆదివారం నాడు దుబాయ్‌లో డ్యాన్స్ చేశాడు. రిత్విక్ నిశ్చితార్థం ఆదివారం నాడు దుబాయ్‌లో జరిగింది.బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తనయుడు రిత్విక్ నిశ్చితార్థం ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి కూతురితో ఆదివారం నాడు దుబాయ్‌లో జరిగింది.
ఈ నిశ్చితార్ధ వేడుకలో పలు పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రమేష్ ఆహ్వానాలు పంపారుఅతిథుల కోసం 15 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. సీఎం రమేష్.
అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు హాజరైన నేపథ్యంలో కొడుకు నిశ్చితార్థంలో తన భార్యతో కలిసి సీఎం రమేష్ పవన్ కళ్యాణ్ సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేశారు.
ఈ నిశ్చాతార్థంలో పాల్గొనేందుకు వచ్చిన అతిథులు సీఎం రమేష్ డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆయనను ఉత్సాహపర్చారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ వివాహం సందర్భంగా బ్రహ్మణి తండ్రి సినీ నటుడు బాలకృష్ణ కూడ డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబునాయుడుతో కూడ బాలయ్య డ్యాన్స్ చేయించే ప్రయత్నం చేశారు.