ఏపీ పంచాయితీ ఎన్నికలు... జిల్లా కలెక్టర్లకు వైసిపి సర్కార్ కీలక ఆదేశాలు

By Arun Kumar PFirst Published Jan 31, 2021, 2:30 PM IST
Highlights

పోలింగ్ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ సర్కార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 9, 11,13, 21 తేదీల్లో జరిగే పోలింగ్ కోసం స్థానికంగా ఆయా గ్రామ పంచాయతీల్లో సెలవు ప్రకటిస్తూ వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

ఇక పోలింగ్ తేదీ నుంచి 44 గంటలు ముందుగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి తరలింపునకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలు సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. 

ఎలక్షన్ ఎజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ వ్యవహరించొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ భవనాలను పోలింగ్ కేంద్రాలుగా వినియోగించుకునేందుకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

read more   ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నాం.. తప్పు చేస్తే క్షమించండి: నిమ్మగడ్డకు ఏపీ జేఏసీ వినతి

ఇక రాష్ట్రవ్యాప్తంగా గడిచిన రెండు రోజులుగా పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 29వ తేదీన మొదటిరోజు సర్పంచ్ ల కోసం 1315 మంది నామినేషన్లు వేసినట్లు ఎస్ఈసీ తెలిపింది. అలాగే అదేరోజు వార్డు సభ్యుల కోసం 2,200 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక నిన్న(శనివారం) 30వ తేదీన సర్పంచ్ ల కోసం 8773 మంది నామినేషన్లు దాఖలు కాగా వార్డు సభ్యుల కోసం 25,519 మంది నామినేషన్లు వేశారు.

మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న పంచాయితీల్లో నామినేషన్లు వేయడానికి ఈరోజు(ఆదివారం) ఫిబ్రవరి ఆఖరి రోజు. దీంతో ఇవాళ అత్యధికంగా నామినేషన్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. దీంతో అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.  

ఇదిలావుంటే విజయనగరం జిల్లాలో నేడు గ్రామ పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అధికారులు. రెండు డివిజన్లలో కలిపి మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు చేపట్టనున్నారు.మొదటి విడతగా పార్వతీపురం డివిజన్లో 15 మండలాల పరిధిలో415 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2 నుండి 4 వరకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ, 13వ తేదీన ఎన్నిక జరగనుంది.

ఇక రెండో విడతగా విజయనగరం డివిజన్లో 9 మండలాల పరిధిలో 248 గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 నుండి 8 వరకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ, 17 వ తేదీన ఎన్నిక జరగనుంది.  మూడో విడతగా విజయనగరం డివిజన్లో మిగిలిన 10 మండలాల పరిధిలో 296 గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుండి 12 వరకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ, 21 వ తేదీన ఎన్నిక జరగనుంది. 

click me!