పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయిన వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా పరిహారం చెల్లించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆదివారం నాడు పిల్ దాఖలైంది.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయిన వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా పరిహారం చెల్లించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆదివారం నాడు పిల్ దాఖలైంది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లింపులో అభిప్రాయం చెప్పాలని ఏపీ హైకోర్టు పలువురికి నోటీసులు జారీ చేసింది.
కేంద్ర ఆర్ధికశాఖ, కేంద్ర జల్ శక్తి, ఆర్ధిక, నీతి ఆయోగ్, పోలవరం అథారిటీతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్.ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిర్ణీత సమయానికి పూర్తి కాకపోవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ఏటా పెరిగిపోతోందని పిటిషనర్ ఆరోపించారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించింది. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. మరో వైపు ప్రాజెక్టు నిర్మాణానికి పెరిగిన అంచనా వ్యయాన్ని కూడ భరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.