ఏపీలో ఇంటింటికి రేషన్ పంపిణీపై హైకోర్టులో ఆదివారం నాడు విచారణ సాగింది.ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ సాగింది.
అమరావతి: ఏపీలో ఇంటింటికి రేషన్ పంపిణీపై హైకోర్టులో ఆదివారం నాడు విచారణ సాగింది.ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ సాగింది.
పార్టీల జోక్యం లేకుండా పథకాలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు సూచించింది. రెండు రోజుల్లో ప్రణాళిక తయారు చేసి ఈసీని కలవాలని హైకోర్టు సూచించింది.ఈ విషయమై ఐదు రోజుల్లో ఎస్ఈసీని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.ఇంటింటికి రేషన్ పథకంపై రాజకీయ పార్టీల రంగులు ఉండకూడదని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.
ఏపీలో ఇంటింటికి రేషన్ పథకానికి సంబంధించి వాహనాలను సీఎం జగన్ ఇటీవల ప్రారంభించారు. ఈ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ ను అందించనున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ కార్యక్రమ ప్రారంభం వాయిదా పడింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి.