అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే.. మరి 12 జిల్లాల గతి: బొత్స

Siva Kodati |  
Published : Dec 20, 2019, 08:19 PM IST
అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే.. మరి 12 జిల్లాల గతి: బొత్స

సారాంశం

అమరావతిని మాత్రమే అభివృద్ది చేస్తే మిగతా 12 జిల్లాల పరిస్థితి ఎంటని మంత్రి ప్రశ్నించారు. ప్రజల తాలూక ప్రయోజనాలే తమకు ముఖ్యమని, లక్ష కోట్లు పెట్టీ రాజధానిని నిర్మించే స్థితిలో ప్రభుత్వం లేదని బొత్స కుండబద్ధలు కొట్టారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. కమిటీలో అందరూ అవగాహన ఉన్న నిపుణులు.... అన్ని పరిశీలించి రిపోర్ట్ ఇచ్చారని ఆయన తెలిపారు. వచ్చే కేబినెట్ సమావేశంలో కమిటీ రిపోర్టును ప్రవేశపెడతామని బొత్స వెల్లడించారు.

13 జిల్లాల సమగ్రాభివృద్ధికి తాము కృషి చేస్తామని, శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీ రిపోర్టును గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆయన గుర్తుచేశారు. అమరావతి ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని, అసెంబ్లీ, రాజ్ భవన్ ఇక్కడే ఉంటుందని సత్యనారాయణ వెల్లడించారు.

Also Read:నివేదికపై భగ్గుమన్న అమరావతి.. జగన్‌ది అన్యాయమంటూ నినాదాలు

రైతులకు డెవలప్మెంట్ చేసిన ప్లాట్‌లు ఇస్తామని, గత ప్రభుత్వ హామీలు నిరవెరుస్తామని బొత్స స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి అసైన్డ్ భూముల పై మాత్రమే మాట్లాడారని, తాము ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలకు కాదని సత్యనారాయణ చురకలంటించారు.

ఇక్కడ మాత్రమే అభివృద్ది చేస్తే మిగతా 12 జిల్లాల పరిస్థితి ఎంటని మంత్రి ప్రశ్నించారు. ప్రజల తాలూక ప్రయోజనాలే తమకు ముఖ్యమని, లక్ష కోట్లు పెట్టీ రాజధానిని నిర్మించే స్థితిలో ప్రభుత్వం లేదని బొత్స కుండబద్ధలు కొట్టారు. చుట్టాల కోసం టీడీపీ ప్రజల సొమ్మును దొపిడి చేసిందని, సీఎం క్యాంప్ కార్యాలయం విజయవాడ లో కూడా ఉంటుందని ఆయన వెల్లడించారు.

Also Read:అమరావతి కుదింపు, వికేంద్రీకరణ ప్లాన్ ఇదీ: జీఎన్ రావు

భూసేకరణలో సేకరించిన భూములు ప్రభుత్వం వినియోగిస్తుందని, హెరిటేజ్ భూములు రాజధాని ఏర్పాటుకు రెండు నెలల ముందు కొనుగోలు చేశారని బొత్స ఆరోపించారు. నిపుణులు ఇచ్చిన రిపోర్టే ఫైనల్ అని.. దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం