నివేదికపై భగ్గుమన్న అమరావతి.. జగన్‌ది అన్యాయమంటూ నినాదాలు

By Siva Kodati  |  First Published Dec 20, 2019, 7:05 PM IST

జీఎన్ రావు కమిటీ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నివేదిక సమర్పించిన నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సచివాలయం-మందడం వై జంక్షన్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.


జీఎన్ రావు కమిటీ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నివేదిక సమర్పించిన నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సచివాలయం-మందడం వై జంక్షన్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి జీఎన్ రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రహదారికి అడ్డంగా జేసీబీ అడ్డుపెట్టి ధర్నా చేయడంతో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్ధితి ఉద్రిక్తగా మారడంతో సచివాలయం నుంచి కమిటీ సభ్యులను వేరొక ప్రాంతంలో పంపించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

Latest Videos

Also Read:అమరావతి కుదింపు, వికేంద్రీకరణ ప్లాన్ ఇదీ: జీఎన్ రావు

ప్రజల అభిప్రాయాలను కమిటీ పరిగణనలోనికి తీసుకోలేదని, రాజధాని కోసం భూములిచ్చిన తమకు తీవ్ర అన్యాయం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతిలో వరద ముంపు వస్తుందని చెబుతున్నారని.. మరి విశాఖలో పరిస్ధితి ఏంటని వారు నిలదీస్తున్నారు. మరోవైపు విశాఖ లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా జీఎన్ రావు కమిటీ సూచించడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. 

జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు శుక్రవారం నాడు మధ్యాహ్నం నివేదికను అందించింది.ఈ సందర్భంగా కమిటీ ఛైర్మెన్ జీఎన్ రావుతో పాటు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు.

పరిపాలన కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించినట్టుగా జీఎన్ రావు కమిటీ  తెలిపింది. వరదముంపు లేని ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ సూచించింది. రాష్ట్రాన్ని  ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్‌లుగా విభజించాలని సూచించినట్టుగా జీఎన్ రావు కమిటీ తేల్చి చెప్పింది.

Also Read:వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్: చంద్రబాబుకు 'ప్రాంతీయ' చిక్కులు

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నివేదికను రూపొందించినట్టుగా కమిటీ తేల్చి చెప్పింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఇంకా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని జీఎన్ రావు కమిటీ తేల్చి చెప్పింది.  గత ప్రభుత్వం ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కూడ తాము పరిశీలించినట్టుగా తెలిపింది.

38 వేల మంది వినతులను పరిశీలించినట్టుగాజీఎన్ రావు తెలిపారు. సుమారు 2 వేల మంది రైతులతో తాను ప్రత్యక్షంగా  పరిశీలించినట్టుగా జీఎన్ రావు స్పష్టం చేశారు.అన్ని జిల్లాలకు వెళ్లి ప్రజల అభిప్రాయాలను పరిశీలించినట్టుగా  కమిటీ తేల్చి చెప్పింది. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, సచివాలయం , వేసవి అసెంబ్లీ ఉండాలని కమిటీ సూచించింది.

click me!