ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్: ఆయన భార్యకు సైతం...

By telugu teamFirst Published Jul 18, 2020, 9:46 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తిరుమలను కూడా అది వదలడం లేదు. తాజాగా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి, ఆయన భార్యకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

అమరావతి: శ్రీకాళహస్తి శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఎమ్మెల్యే మదుసూదన్ రెడ్డి తిరుపతిలోని అమర ఆస్పత్రిలో చేరారు. 

ఇదిలావుంటే, శక్రవారంనాటి వివరాల ప్రకారం..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. తాజా కేసులతో మొత్తం 40,646 కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా సంభవిస్తూనే ఉన్నాయి. తాజా మరణాలతో సంఖ్య 534కు చేరుకుంది.

గత 24 గంటల్లో ఏపీలో 2602 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందినవారిలో 2592 మందికి కోరనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 8 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది.

గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా తన విశ్వరూపం ప్రదర్శించింది. ఒక్క రోజులోనే 643 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 297, చిత్తూరు జిల్లాలో 328, గుంట్ూరు జిల్లాలో 367, కడప జిల్లాలో 55, కృష్ణా జిల్లాలో 37, కర్నూలు జిల్లాలో 315 కేసులు నమోదయ్యాయి.

నెల్లూరు జిల్లాలో 127, ప్రకాశం జిల్లాలో 53, శ్రీకాకుళం జిల్లాలో 149, విశాఖపట్నం జిల్లాలో 23, విజయనగరం జిల్లాలో 89, పశ్చిమ గోదావరి జిల్లాలో 109 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మోత్తం 2461 మందికి కరోనా వైరస్ సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 434 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 

తాజాగా గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో ఆరుగురు మరణించారు. చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురేసి మృత్యువాత పడ్డారు. గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో నలుగురేసి కరోనా వైరస్ కారణంగా మరణించారు. కడప, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. 

ఏపీలో జిల్లాలవారీగా మొత్తం కరోనా వైరస్ కేసులు, మరణాలు

అనంతపురం 4284, మరణాలు 58
చిత్తూరు 3864, మరణాలు 43
తూర్పు గోదావరి 4505, మరణాలు 34
గుంటూరు 4330, మరణాలు 39
కడప 2275, మరణాలు 21
కృష్ణా 3021, మరణాలు 86
కర్నూలు 5131, మరణాలు 116
నెల్లూరు 1717, మరణాలు 18
ప్రకాశం 1448, మరణాలు 26
శ్రీకాకుళం 1852, మరణాలు 16
విశాఖపట్నం 1716, మరణాలు 28
విజయనగరం 1071, మరణాలు 13
పశ్చిమ గోదావరి 2537, మరమాలు 36 

click me!