ఏపీ మంత్రి విశ్వరూప్ ను చికిత్స కోసం కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు. మరోసారి మంత్రి విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైకి తీసుకువెళ్లారు ఫ్యామిలీ మెంబర్స్
అమరావతి: ఏపీ మంత్రి విశ్వరూప్ ను కుటుంబ సభ్యులు ముంబైకి తీసుకు వెళ్లారు మంత్రి వి:శ్వరూప్ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం ముంబైకి తీసుకువెళ్లారు.ఈ నెల 2 వ తేదీన ఏపీ మంత్రి విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిసేపటికే మంత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత మంత్రి కోలుకున్నారు. కోలుకున్న తర్వాత మంత్రి విశ్వరూప్ ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
also read:అస్వస్థతకు గురైన ఏపీ మంత్రి విశ్వరూప్ : రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
undefined
అయితే మరోసారి మంత్రి విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మంత్రి విశ్వరూప్ ను శుక్రవారం నాడు కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు. ముంబైలోని ఆసుపత్రిలో మంత్రి కి చికిత్స అందించనున్నారు.ఈ నెల మొదటి వారంలో అస్వస్థతకు గురైన సమయంలో రాజమండ్రిలో చికిత్స నిర్వహించిన తర్వాత ఆయన హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మరోసారి ఆయన అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది.