వైసీపీ నేత రవితేజ హత్య: లారీకి నిప్పు, సింగరాయకొండలో ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Sep 23, 2022, 10:49 AM IST
Highlights

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో ఉద్రిక్తత  నెలకొంది. వైసీపీ నేత రవితేజ హత్యకు ఉపయోగించిన లారీని ఆయన వర్గీయులు దగ్దం చేశారు. 

ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని  సింగరాయకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత రవితేజను లారీతో ఢీకొట్టి చంపారు ప్రత్యర్ధులు. నిందితులు ఉపయోగించిన లారీని  పోలీస్ స్టేషన్ వద్ద ఉంచారు. రవితేజ మరణించిన విషయం తెలుసుకున్న ఆయన వర్గీయులు  పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. .పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న రవితేజ హత్యకు ఉపయోగించిన లారీకి నిప్పు పెట్టారు.  పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న చలివేంద్రాన్ని కూడ దగ్దం చేశారు. 

రవితేజ హత్యకు పార్టీలోని మరో వర్గం నేతలు కారణమని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. రవితేజ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.రవితేజ హత్య నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్తత నెలకొనడంతో  పోలీసులు భారీగా మోహరించారు. ఒంగోలు నుండి అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

also read:ప్రకాశంలో దారుణం.. నడిరోడ్డుపై లారీతో ఢీకొట్టి వైసీపీ నాయకుడి హత్య..
పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.  రవితేజ హత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రవితేజ హత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు పలువురిని విచారిస్తున్నారు. 

click me!