Chittoor: జగనన్న సురక్ష పథకం ప్రజల పాలిట శ్రీరామ రక్ష అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రయివేటు సంస్థల కంటే ప్రభుత్వ స్కూల్ విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విజనరీ ఉన్న సీఎం అంటూ పేర్కొన్నారు.
AP Tourism and Sports Minister R K Roja: జగనన్న సురక్ష పథకం ప్రజల పాలిట శ్రీరామ రక్ష అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీసీ మెరుగైన పాలన అందిస్తున్నదని తెలిపారు. ప్రయివేటు సంస్థల కంటే ప్రభుత్వ స్కూల్ విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విజనరీ ఉన్న సీఎం అంటూ కొనియాడారు. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ డెయిరీని చంద్రబాబు మూసేస్తే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెరిచారని పేర్కొన్నారు. తనను గెలిపించిన కుప్పం ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయారంటూ చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. కానీ, సీఎం జగన్ కుప్పం మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్ చేసి చూపించారని అన్నారు.
ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులందరికి అందించడమే ధ్యేయంగా జగనన్న సురక్ష పథకం జగన్ సర్కారు తీసుకువచ్చింది. ఈ జగనన్న సురక్ష పథకం గురించి మంత్రి రోజా మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. ప్రజల పాలిట శ్రీరామ రక్షగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రయివేటు సంస్థల కన్నా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారని అన్నారు. మెరుగైన పాలన అందించడంలో సీఎం జగన్ ఒక విజనరీ ఉన్న సీఎం అనీ, టెక్నాలజీని ప్రజలకు చేరువ చేస్తూ ఈరోజు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని పేర్కొన్నారు.