బట్టలూడదీసి అర్ధనగ్నంగా కూర్చోబెట్టి... ధర్మవరం వ్యాపారులపై బెజవాడలో రౌడీయిజం (వీడియో)

Published : Jul 06, 2023, 03:41 PM ISTUpdated : Jul 06, 2023, 05:24 PM IST
   బట్టలూడదీసి అర్ధనగ్నంగా కూర్చోబెట్టి... ధర్మవరం వ్యాపారులపై బెజవాడలో రౌడీయిజం  (వీడియో)

సారాంశం

ధర్మవరం చీరల వ్యాపారులపై బెజవాడకు చెందిన ఓ వస్త్రదుకాణ: యజమాని అతి దారుణంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

విజయవాడ: ధర్మవరం చీరల వ్యాపారులపై బెజవాడలోని ఓ వస్త్రదుకాణం యజమాని అంత్యంత దారుణంగా ప్రవర్తించాడు.గతంలో చీరలు అమ్మిన బకాయి డబ్బులు ఇవ్వాలని అడిగిన వ్యాపారులను నిర్భంధించి దారుణంగా చితకబాదారు. బట్టలూడదీసి అర్ధనగ్నంగా కూర్చోబెట్టి దాష్టికం ప్రదర్శించారు. ఈ దాడిని వీడియో తీసి ఇతర వ్యాపారులకు పంపించి వారిని కూడా బెదిరించారు. ఈ దారుణ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. 

ధర్మవరం చీరలను బెజవాడలోని వస్త్ర దుకాణాలకు సరఫరా చేస్తుంటారు ఇద్దరు వ్యాపారాలు. ఇలా ఓ వస్త్రదుకాణానికి చీరలు సరఫరా చేయగా కొంతడబ్బు బకాయి పెట్టారు. ఆ బకాయి డబ్బులు వసూలు చేసుకోడానికి వ్యాపారులిద్దరు సదరు వస్త్ర దుకాణం యజమానికి కలిసారు. ఈ క్రమంలోనే వారిమధ్య బకాయి డబ్బులు విషయంలో వివాదం చెలరేగింది. 

వీడియో

చీరల వ్యాపారులపై కోపంతో ఊగిపోయిన వస్త్రదుకాణం యజమాని వారిపై దౌర్జన్యానికి దిగాడు. వ్యాపారులను బట్టలూడదీసి అర్థనగ్నంగా నేలపై కూర్చోబెట్టాడు. తమను వదిలిపెట్టాలని వ్యాపారులు వేడుకున్నా వినకుండా బూతులు తిడుతూ చితకబాదాడు. ఇదంతా వీడియో తీసి ధర్మవరంలోని ఇతర వ్యాపారులకు పంపించాడు. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారి  పోలీసుల వద్దకు  చేరింది. 

Read More  పల్నాడులో దారుణం : ఆస్తి తగాదాలతో తల్లిని, చెల్లిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన కిరాతకుడు

ధర్మవరం వ్యాపారులపై దాడిజరిగి 20 రోజులు అవుతున్నా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన విజయవాడ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సదరు వస్త్రదుకాణం యజమాని ఆగడాలపై ఆరా తీస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!