ఆ ట్వీట్లకు లోకేష్ ఎందుకు స్పందిస్తున్నారు

First Published Jul 5, 2018, 6:31 PM IST
Highlights

పెద్దగా ఫాలోవర్లు లేకపోయినా తమ సమస్యను  మంత్రి దృష్టికి తెచ్చేందుకు కొందరు నకిలీ ట్విట్టర్ ఖాతాను తెరిచి ఏపీ మంత్రి నారాలోకేష్ కు ట్యాగ్ చేస్తున్నారు. ఈ ట్వీట్లకు మంత్రి సమాధానం ఇస్తున్నారు. ఈ రకమైన ట్వీట్లకు కూడ మంత్రి సమాధానం ఇవ్వడంపై నెటిజన్లు చర్చించుకొంటున్నారు.


హైదరాబాద్: ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్  ట్విట్టర్ ఖాతాకు సంబంధించిన వివాదం ఆన్‌లైన్‌లో ఆసక్తికర చర్చను లేవనెత్తుతోంది.పలువురు నెటిజన్లు ట్వీట్స్ ద్వారా విన్నవించుకొంటున్న సమస్యలకు లోకేష్ రిప్లై చేస్తున్నారు. లోకేష్  నుండి రిప్లై చేసిన  అన్నీ కూడ నకిలీ ఖాతాల నుండి  వస్తున్నాయనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ ఖాతాలు తయారు చేసి వాటి ద్వారా వచ్చే  ట్వీట్స్‌కు లోకేష్ ప్రత్యుత్తరం ఇస్తున్నారని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.లోకేష్ రిప్లై ఇచ్చిన ట్వీట్లకు పెద్దగా ఫాలోవర్లు లేకపోవడం కూడ ప్రధాన కారణమని కొందరు నెటిజన్లు  అభిప్రాయపడుతున్నారు.

పెద్దగా ఫాలోవర్లు లేని వారి నుండి వచ్చే ట్వీట్లకు లోకేష్ ఎందుకు రిప్లై ఇస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  రెగ్యులర్‌గా ట్వీట్ చేస్తూ మంచి ఫాలోవర్ల సంఖ్య కలిగిన వారు చేసే ట్వీట్‌కు స్పందించడం వేరు. అప్పటికప్పుడు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి మంత్రికి ట్యాగ్ చేయడంతో లోకేష్ వాటికి స్పందించడంపై  నెటిజన్లు  ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశ్యంతోనే నకిలీ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించి మంత్రికి ట్యాగ్ చేస్తున్నారనే అభిప్రాయాలను కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.  

 

 

కేవలం ఏదో హైప్ క్రియేట్ చేయడం కోసమే నకిలీ ఖాతాలు తయారుచేసి.. వాటికి ద్వారా వచ్చే  ట్వీట్స్‌కు లోకేష్ ప్రత్యుత్తరం ఇస్తున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  ఎందుకంటే.. లోకేష్‌కు ట్వీట్ చేస్తున్నవారికి పెద్దగా ఫాలోవర్లు లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య. జీరో ఫాలోవర్లు ఉన్న ఖాతాలు, పెద్దగా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా లేని ఖాతాల ద్వారా వచ్చే ట్వీట్స్‌కి లోకేష్ ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు తమ సందేహాలను కూడా వెల్లిబుచ్చారు. అయితే సమస్యను మంత్రి దృష్టికి తేవడం కోసం ఈ రకంగా  చేస్తున్నవారు కూడ లేకపోలేదనే అభిప్రాయపడేవారు కూడ లేకపోలేదు.

click me!