చంద్రబాబు (chandrababu) సతీమణి భువనేశ్వరిపై (nara bhuvaneshwari) వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు బాగోలేదని వర్ల రామయ్య (varla ramaiah) అభిప్రాయపడ్డారు. వంశీ, కొడాలి నానిలు ఇద్దరు Jr NTR శిష్యులు కాదా అని ప్రశ్నించారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా అంటూ వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై(Jr NTR) తెలుగు దేశం పార్టీ (telugu deasm party) పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (varla ramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు (chandrababu) సతీమణి భువనేశ్వరిపై (nara bhuvaneshwari) వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు బాగోలేదని అభిప్రాయపడ్డారు. మేనత్తను నోటికొచ్చినట్లు మాట్లాడితే వాటిని ఖండించడంలో మేనల్లుడిగా జూనియర్ ఎన్టీఆర్ విఫలం అయ్యారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రం మొత్తం అనుకుంటుందని చెప్పారు. నారా దంపతులకు వర్ల దంపతుల మద్దతు అనే నినాదంతో వర్ల రామయ్య దంపతులు విజయవాడలోని ఆయన స్వగృహంలో 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు.
భువనేశ్వరిపై శాసనసభలో చేసిన వ్యాఖ్యలను వైసీపీ ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీటిపై సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన చట్టసభల్లో వ్యక్తిగత దూషణలు ఏంటని ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వర్ల రామయ్య.. భువనేశ్వరిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వంశీని, నానిలను ఎందుకు మందలించలేదని ప్రశ్నించారు. వారిని మందలించే హక్కు ఎన్టీఆర్‌కు లేదా అని అన్నారు. వంశీ, కొడాలి నానిలు ఇద్దరు ఎన్టీఆర్ శిష్యులు కాదా అని ప్రశ్నించారు. జూనియర్‌కు సన్నిహితులుగా చెప్పుకొనే వంశీ, కొడాలినానీ.. హద్దులు మీరి విమర్శిస్తుంటే స్పందించాల్సింది ఇలాగేనా అని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన ప్రవచనాలు చెప్పినట్టుగా ఉందన్నారు.
వల్లభనేని వంశీ (vallabhaneni vamsi) ఫొటోలు పెట్టినప్పుడే తారక్ ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. బాలయ్య స్పందించిన దాంట్లో తారక్ 10శాతం కూడా మాట్లాడలేదన్నారు. జూనియర్ ఎన్టీయార్ అంటే వంశీ, నానిలకు చాలా భయమని.. అతడు వార్నింగ్ ఇస్తే ఇద్దరు జగన్‌ను కూడా వదిలి వెళ్తారని వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా అంటూ వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మరి వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు.. ఆయన చేతిలో లేవా అని ప్రశ్నించారు. సీతయ్య (nandamuri harikrishna) బతికి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. సీతయ్య నేరుగా రంగంలోకి దిగి ఉండేవాడని అన్నారు. పార్టీ కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండేవారే.. తమ వారని చెప్పారు.
మద్దతు తెలిపిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా
వర్ల రామయ్య నిరసన దీక్షకు టీడీసీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా సంఘీభావం తెలిపారు. జూనియర్‌పై తమ మనసులో ఉందే... వర్ల రామయ్య బయట పెట్టారన్నారు. జూనియర్ స్పందించి తీరు మాత్రం తమను బాధిస్తోందని అన్నారు.