దళిత విద్యార్థులపై దాష్టీకం.. మరుగుదొడ్లు వాడనివ్వకుండా, వాతలు తేలేలా కొట్టిన హెడ్ మాస్టర్...

By AN TeluguFirst Published Nov 25, 2021, 1:08 PM IST
Highlights

పాఠశాలను ముట్టడించిన తల్లిదండ్రులు ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని, మరుగుదొడ్లను వినియోగించుకొనివ్వడం లేదని, బాత్రూంకు ఇంటికే వెళ్ళమని పంపుతున్నారని ఆరోపించారు.  యూనిఫాంలు, పుస్తకాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన పిల్లలను వేధిస్తున్నారని  మండిపడ్డారు.

జగ్గయ్యపేట : దేచుపాలెం మండలం పరిషత్ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అకారణంగా విద్యార్థులను దండిస్తున్నందుకు నిరసనగా బుధవారం తల్లిదండ్రులు schoolను ముట్టడించారు. afternoon భోజనం చేస్తున్న నాలుగో తరగతి విద్యార్థి ఉదయభార్గవ్, ఒకటో తరగతి చదువుతున్న జెస్సీలు తోటి studentsతో మాట్లాడుతున్నారని నెపంతో  బెత్తంతో విపరీతంగా కొట్టడంతో వీపుపై వాతలు తేలాయి.  

అక్కడికి వచ్చిన ఓ మహిళ అదేంటి.. ఎందుకు కొడుతున్నారు.. అని ప్రశ్నిస్తే ఆమెతో Headmaster దురుసుగా మాట్లాడడంతో..  ఆమె బాలిక తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో వారంతా వచ్చి ప్రధానోపాధ్యాయుని ఏమిటని నిలదీశారు. 

ఆ తరువాత వారు విలేకరులతో మాట్లాడుతూ Dalit studentsపై వివక్ష చూపుతున్నారని, Toiletsను వినియోగించుకొనివ్వడం లేదని, బాత్రూంకు ఇంటికే వెళ్ళమని పంపుతున్నారని ఆరోపించారు.  యూనిఫాంలు, పుస్తకాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన పిల్లలను వేధిస్తున్నారని  మండిపడ్డారు.

ఈ స్కూల్ లో ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో టీచర్ పనిచేస్తుందని... అయితే, రోజూ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే వస్తుంటారని చెప్పారు. అయితే ఈ ఆరోపణ మీద ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా, ఆయన దానికి నిరాకరించారు. విలేకరులు ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి  నాగరాజును వివరణ కోరగా,  సంఘటన తన దృష్టికి రాలేదని ఆయన చెప్పారు. 

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్‌లో అక్టోబర్ లో ఇలాంటి అవాంఛనీయ ఘటనే చోటుచేసుకుంది. పిల్లలకు క్రమశిక్షణ నేర్పాల్సిన గురువు హద్దుమీరి ప్రవర్తించాడు. రెండో తరగతి పిల్లాడికి భయం చెప్పాలని ఏకంగా School బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి తలక్రిందులుగా వేలాడదదీశారు. ఓ కాలు పట్టుకుని బాలుడిని తలక్రిందులుగా వేలాడదీస్తుంటే ఒకరు ఆ ఘటనను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోతో వెలుగులోకి వచ్చిన Head Master తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

విశాఖలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం... సీఐ మృతి, హోంగార్డుకు గాయాలు

Uttar Pradeshలోని Mirzapurలో ఓ స్కూల్ హెడ్‌మాస్టర్‌గా మనోజ్ విశ్వకర్మ పనిచేస్తున్నారు. సోను యాదవ్ అనే రెండో తరగతి పిల్లాడు తమను కొరికాడని ఓ విద్యార్థి హెడ్‌మాస్టర్ మనోజ్ విశ్వకర్మకు ఫిర్యాదు ఇచ్చారు. మంగళవారం లంచ్ బ్రేక్ సమయంలో పిల్లలాంత బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆటలాడుకుంటుండగానే సోను యాదవ్ తమను కొరికాడని ఆరోపించారు. దీంతో మనోజ్ విశ్వకర్మ పిల్లాడిపై తీసుకున్న చర్యలు వివాదాస్పదమయ్యాయి.

మళ్లీ అలా కొరకకుంటా బుద్ధి చెప్పాలనుకున్న హెడ్ మాస్టర్ మనోజ్ విశ్వకర్మ Class రూమ్ నుంచి పిల్లాడిని గుంజుకెళ్లాడు. స్కూల్ టాప్ ఫ్లోర్ వరకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి పిల్లాడిని ఎత్తుకుని ఓ కాలు పట్టుకుని తలక్రిందులుగా వేలాడదీశారు. పిల్లాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. భయంతో బెంబేలెత్తుతూ వణికిపోయాడు. సారీ చెప్పు సారీ చెప్పు అంటూ హెడ్ మాస్టర్ మనోజ్ విశ్వకర్మ అడిగాడు. సారీ చెప్పకుంటే అక్కడి నుంచి పిల్లాడిని వదిలిపెడ్తాననీ భయపెట్టాడు.

పిల్లాడి కేకలతో తరగతి గదుల్లోని పిల్లలంతా అక్కడికి చేరుకున్నారు. పిల్లలంతా గుమిగూడుతూ అక్కడికి రావడాన్ని హెడ్ మాస్టర్ చూశాడు. ఆ తర్వాత పిల్లాడిని పైనకు తీసుకుని విడిచిపెట్టాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పిల్లాడు చేసింది తప్పే అయినా, హెడ్ మాస్టర్ అలా చేసి ఉండకూడదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ఆ పిల్లాడి తండ్రి మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం.

click me!