రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడమే గుడ్ గవర్నెన్సా: బాబుపై బొత్స సెటైర్లు

By narsimha lodeFirst Published Jun 30, 2020, 6:01 PM IST
Highlights

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడమేనా గుడ్ గవర్నెన్స్ అంటే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. 

అమరావతి: రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడమేనా గుడ్ గవర్నెన్స్ అంటే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. 

మంగళవారం నాడు అమరావతిలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 108, 104లకు మళ్లీ పునర్వైభవం తీసుకొంటే మళ్లీ విమర్శలు గుప్పిస్తున్నారన్నారని ఆయన బాబుపై మండిపడ్డారు. 

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే బ్రేక్ డౌన్ అని రిప్లై వచ్చేదని ఆయన చెప్పారు.కరోనాపై పోరాటం చేస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంటే అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు.

పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తోంటే చంద్రబాబు అడ్డుకొంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబే .. తమ పాలనలో రాష్ట్రం నాశనమౌతోందని చెప్పడం దురదృష్టకరమన్నారు. 

మీ చర్యలను ప్రజలు హర్షిస్తారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 108, 104 ఎప్పుడైనా కన్పించాయా అని ఆయన ప్రశ్నించారు. 

ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు చంద్రబాబు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులను కూడ తమ ప్రభుత్వం తీర్చిందని ఆయన గుర్తు చేశారు. 

also read:ఏడాదిలో రూ. 2 లక్షల కోట్లు వెనక్కి: జగన్ పై బాబు విమర్శలు

చంద్రబాబునాయుడు 2.45 లక్షల కోట్ల అప్పుల్లోకి రాష్ట్రాన్ని నెట్టాడని మంత్రి బొత్స విమర్శించారు. చంద్రబాబు హాయంలో పేదలకు ఒక్క ఇళ్లైనా కట్టాడా అని ఆయన ప్రశ్నించారు. 

తమ హాయంలో పేదల కోసం కనీస సౌకర్యాలు కూడ కల్పించలేని ప్రభుత్వం తమపై విమర్శలు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబునాయుడు ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వలేదన్నారు.

click me!