పెళ్లి చూపుల్లో కరోనా కలకలం: హోం క్వారంటైన్‌‌లో ఐదుగురు

By narsimha lodeFirst Published Jun 30, 2020, 5:30 PM IST
Highlights

 తూర్పు గోదావరి జిల్లా  పి. గన్నవరం మండలం ఎర్రంశెట్టివారి పాలెం గ్రామంలో పెళ్లి చూపులకు వెళ్లిన ఓ కుటుంబంలో కరోనా కలకలం సృష్టించింది. దీంతో ఐదుగురిని హోం క్వారంటైన్ చేశారు అధికారులు.


పి. గన్నవరం: తూర్పు గోదావరి జిల్లా  పి. గన్నవరం మండలం ఎర్రంశెట్టివారి పాలెం గ్రామంలో పెళ్లి చూపులకు వెళ్లిన ఓ కుటుంబంలో కరోనా కలకలం సృష్టించింది. దీంతో ఐదుగురిని హోం క్వారంటైన్ చేశారు అధికారులు.

ఎర్రంశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సమీపంలోని వేరే గ్రామంలో యువతిని చూసేందుకు వెళ్లారు. అమ్మాయిని చూసి వచ్చిన తర్వాత అమ్మాయి తరపున బంధువులకు కరోనా సోకినట్టుగా తెలిసింది.

దీంతో అమ్మాయిని చూసేందుకు వెళ్లిన ఐదుగురు కుటుంబసభ్యుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వీరంతా కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. ఈ పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ ఫలితాలు వచ్చేవరకు ఈ ఐదుగురిని హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు.పెళ్లి చూపులకు వెళ్లి వచ్చినవారంతా హొం క్వారంటైన్ లో ఉండడంతో గ్రామస్తులు కూడ ఆందోళన చెందుతున్నారు. 

గత 24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో 704 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 14,595కి చేరుకొన్నాయి. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 187 మంది మరణించారు. కరోనాతో ఇప్పటివరకు 5245 మంది కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని ఏపీ ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది.


 

click me!