వైసీపీలో సద్దుమణగని రఘురామకృష్ణంరాజు ఇష్యూ: ‘ తేడా ’ అంటూ తణుకు ఎమ్మెల్యే వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jun 30, 2020, 05:28 PM ISTUpdated : Jun 30, 2020, 05:32 PM IST
వైసీపీలో సద్దుమణగని రఘురామకృష్ణంరాజు ఇష్యూ: ‘ తేడా ’ అంటూ తణుకు ఎమ్మెల్యే వ్యాఖ్యలు

సారాంశం

వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం సద్దుమణగలేదు. ఈ క్రమంలో ఆయనపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు. అతనొక తేడా మనిషి.. ఎంపీని తాము అసలు మనిషిలాగే గుర్తించడం లేదని తేల్చిచెప్పారు

వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం సద్దుమణగలేదు. ఈ క్రమంలో ఆయనపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు. అతనొక తేడా మనిషి.. ఎంపీని తాము అసలు మనిషిలాగే గుర్తించడం లేదని తేల్చిచెప్పారు.

రఘురామకృష్ణంరాజు బీజేపీలోకి వెళ్లిపోతున్నారు కనుకనే.. మోడీ భజన చేస్తున్నారని కారుమూరి మండిపడ్డారు. మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు బంధువులు వందల కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ చేశారని నాగేశ్వరరావు ఆరోపించారు.

Also Read:వెంకన్న భక్తుడిని కాబట్టి...: జగన్ కు రఘురామ ఆరు పేజీల లేఖ

కళా వెంకట్రావు మంత్రిగా ఉన్న సమయంలో ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన గుర్తుచేశారు. తణుకు నియోజకవర్గంలో పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల విషయంలో తనపై బురద జల్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆరు పేజీల లేఖ రాసారు. తనకు వచ్చిన షో కాజ్ నోటీసుకి ఇది రిప్లై కాదు అని స్పష్టంగా నొక్కి చెబుతూనే విజయసాయిరెడ్డి లేఖను ప్రస్తావించారు  రఘురామకృష్ణంరాజు.

ఈ లేఖలో తొలుత జగన్ మోహన్ రెడ్డికి ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగవ స్థానం రావడంపై శుభాకాంక్షలు తెలిపి త్వరలో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని అభిలాషించారు.

Also Read:రఘురామకృష్ణంరాజు ఇష్యూ: కేంద్ర మంత్రులతో ఎంపీ బాలశౌరి వరుస భేటీలు, ఏం జరుగుతోంది?

తనకు వెంకటేశ్వరా స్వామికి వీర భక్తుడను అని, తనను తరచుగా యాంటీ క్రిస్టియన్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో ముఖ్యమంత్రిని నమ్మి హిందువులు కూడా ఓట్లేశారని, వెంట నిలబడ్డారని అన్నారు.

తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సైనికుడనని, ఎప్పుడు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. ఈ లేఖ ద్వారా తనపై జరిగిన అవస్థపు ప్రచారాలను ఖండించాలనుకొని మాత్రమే ఈ లేఖను రాస్తున్నానని, త్వరో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తారని ఆశిస్తున్నాను అంటూ ముగించాడు

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu