త్వరలోనే విశాఖలో రాజధానికి అడ్డంకులు తొలుగుతాయి:మంత్రి బొత్స

By narsimha lodeFirst Published Oct 25, 2022, 4:00 PM IST
Highlights

విశాఖలో  పరిపాలన రాజధానికి  అడ్డంకులు తొలగిపోతాయని ఏపీ మంత్రి   బొత్స సత్యనారాయణ చెప్పారు.  విశాఖ వాసుల కోరిక త్వరలోనే నెరవేరనుందన్నారు.

అమరావతి: విశాఖలో పరిపాలన రాజధానికి  త్వరలోనే  ఆడ్డంకులు తొలగిపోనున్నాయని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు. మంగళవారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు.అడ్డంకులను అధిగమించి  త్వరలోనే విశాఖపట్టణం  రాజధానిగా మారనుందన్నారు.ఉత్తరాంధ్ర ప్రజల  ఆకాంక్ష  ఇక సాకారమైనట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.అమరావతి  రైతుల  పాదయాత్ర  ఇక  కొనసాగదన్నారు. అమరావతి రైతుల  పాదయాత్ర వెనుక టీడీపీ ఉందన్నారు. పాదయాత్రను రైతులు నిలిపివేయడంతో ఈ  యాత్ర వెనుక  టీడీపీ ఉందని తేలిపోయిందన్నారు.పాదయాత్రలో 60 మంది రైతులు కూడ లేరని  మంత్రిబొత్స సత్యనారాయణ చెప్పారు.పాదయాత్రలో  600  మంది  పాల్గొంటే 60  మంది రైతులు కూడ లేరన్నారు.వచ్చే నెలలో  భోగాపుం ఎయిర్  పోర్టు గిరిజన వర్శిటీకి ప్రధాని శంకుస్థాపన చేస్తారని  మంత్రి చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత  మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని  ప్రాంతాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతోనే  మూడు రాజధానులను తెరమీదికి  తెచ్చినట్టుగా వైసీపీ చెబుతుంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమరావతి రాజధానికి జగన్  ఒప్పుకున్నాడని  విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. 

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని  కోరుతూ అమరావతి  నుండి  అరసవెల్లికి రైతులు  పాదయాత్ర  చేస్తున్నారు. దీపావళిని  పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు  యాత్రకు రైతులు విరామం  ప్రకటించారు. మరో వైపు అమరావతి రైతుల పాదయాత్రకు  వ్యతిరేకంగా  మూడు  రాజధానులకు అనుకూలంగా  వైసీపీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రౌండ్ టేబుల్  సమావేశాలు నిర్వహించిన  వైసీపీ మూడు  రాజధానులకు అనుకూలంగా మద్దతు కూడగట్టే  ప్రయత్నం  చేసింది.  మూడు రాజధానులకు అనుకూలంగా  జేఏసీ కూడ ఏర్పాటైంది. జేఏసీ ఆధ్వర్యంలో  ఈ నె  15న విశాఖగర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రుల కార్లపై జనసేన  కార్యకర్తలు  దాడికి దిగారు. అయితే  ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన స్పష్టం చేసింది.

also read:ఆధార్ కార్డ్ అడిగితే పారిపోయారు.. వాళ్లు రైతులేనా, అంతా దోపిడీ దొంగలే : అంబటి రాంబాబు వ్యాఖ్యలు

అమరావతి రైతుల పాదయాత్ర సాగుతున్న ప్రాంతాల్లో వైసీపీ  నిరసనలకు దిగుతుంది.  పాదయాత్ర సాగే ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు  పాదయాత్రకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.దీంతో  చాలా  చోట్ల  ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పాదయాత్రలో అనుమతి  ఉన్నవారే పాల్గొనాలని  హైకోర్టు ఇటీవలనే  ఆదేశించింది.  పాదయాత్రకు మద్దతిచ్చేవారు రోడ్డుకు ఇరువైపులా  ఉండి మద్దతివ్వాలని  ఆదేశించింది. 


 

click me!