అమరావతి నిర్మాణాలపై ప్రభుత్వం స్పష్టతతో ఉందని ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
అమరావతి: అమరావతి నిర్మాణాలపై ప్రభుత్వం స్పష్టతతో ఉందని ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. గురువారం నాడు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూములిచ్చిన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు.
భూములిచ్చిన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు. అమరావతి నిర్మాణాలపై ప్రభుత్వం స్పష్టతతో ఉందన్నారు. చంద్రబాబునాయుడు తాను సీఎంగా ఉన్న సమయంలో తాత్కాలిక నిర్మాణాలకే వందల కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కాలంలో అమరావతిలో రోడ్డు నిర్మాణాలు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ఆ సమయంలో ఎవరు అడ్డుకొన్నారని ఆయన ప్రశ్నించారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చినట్టుగా చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో చేసినట్టుగా దుబారా చేయడం లేదన్నారు.
చంద్రబాబునాయుడు 14 ఏళ్లుగా ఉండి కుప్పం నియోజకవర్గానికి ఏం చేశావని ఆయన ప్రశ్నించారు. పులివెందులకు వైఎస్ఆర్, జగన్ అనేక కార్యక్రమాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను నాయకులు చేపట్టాలని ఆయన హితవు పలికారు.
చంద్రబాబుడిపై ఆయన పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నారు. అందుకే ఇటీవల వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.