స్వరూపానందేంద్ర స్వామిపై వ్యాఖ్యలు: చంద్రబాబుపై సజ్జల విమర్శలు

Siva Kodati |  
Published : Feb 25, 2021, 03:50 PM ISTUpdated : Feb 25, 2021, 03:51 PM IST
స్వరూపానందేంద్ర స్వామిపై వ్యాఖ్యలు: చంద్రబాబుపై సజ్జల విమర్శలు

సారాంశం

స్వరూపానందేంద్ర స్వామీజిపై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన భాష దారుణంగా వుందని సజ్జల మండిపడ్డారు. గతంలో స్వామీజీని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కలిశారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు

స్వరూపానందేంద్ర స్వామీజిపై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన భాష దారుణంగా వుందని సజ్జల మండిపడ్డారు. గతంలో స్వామీజీని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కలిశారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

కుప్పంలో ఓటమితో చంద్రబాబు అసహనంతో మాట్లాడుతున్నారని సజ్జల పేర్కొన్నారు. అంతకుముందు ఆయన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించించారు.

అనంతపురం నేత ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా రెండోసారి ఛాన్స్ ఇచ్చింది వైసీపీ. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఆయన కుమారుడు కల్యాణ్ చక్రవర్తికి మండలిలో ఛాన్స్ ఇచ్చింది.

కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఆయన కుమారుడు చల్లా భగీరథ రెడ్డికి అవకాశం ఇచ్చింది. విజయవాడ నుంచి కార్పోరేటర్ మహ్మద్ కరీమున్నీసాకు ఛాన్స్ ఇచ్చింది.

విజయవాడ సెంట్రల్‌లో 56వ కార్పోరేటర్‌గా పనిచేశారు కరీమున్నీసా. శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు, సీనియర్ నేత సీ. రామచంద్రయ్యకు అవకాశం కల్పించినట్లు సజ్జల పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు