ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో జనం తిప్పలు: కేటీఆర్‌కు బొత్స ఫోన్.. హాస్టల్స్‌కు సర్కార్ వార్నింగ్

By Siva KodatiFirst Published Mar 25, 2020, 9:13 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్- తెలంగాణ బోర్డర్‌లో విద్యార్ధుల ఇబ్బందులపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ విషయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో బొత్స ఫోన్‌లో మాట్లాడారు. 

ఆంధ్రప్రదేశ్- తెలంగాణ బోర్డర్‌లో విద్యార్ధుల ఇబ్బందులపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ విషయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో బొత్స ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి రావడం శ్రేయస్కరం కాదని బొత్స అన్నట్లుగా తెలుస్తోంది.

అటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తెలంగాణ సీఎంవో అధికారులతో ఏపీ సీఎంవో అధికారులు సంప్రదింపులు జరిపారు.

Also Read:జగ్గయ్యపేట వద్ద భారీగా ట్రాఫిక్ జాం: ఏపీలోకి అనుమతించని పోలీసులు

అనంతరం హైదరాబాద్‌లోని హాస్టల్స్ మూసివేయొద్దని మంత్రి కేటీఆర్ హాస్టళ్ల యజమానులకు సూచించారు. వెంటనే హాస్టల్స్ యాజమాన్యాలతో మాట్లాడాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్‌లో ఉన్న ఏపీ విద్యార్ధులు, ఉద్యోగులు ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడి వారు అక్కడే వుండేలా చూడాలని మంత్రి సూచించారు. ఏమైనా సమస్యలుంటే 1902కు కాల్ చేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

Also Read:కరోనా లాక్ డౌన్: పిలిస్తే పలుకుతా... అంటూ కష్టాలు తీరుస్తున్న కేటీఆర్

అటు విద్యార్ధుల ఇబ్బందులు, హాస్టల్స్ మూసివేతపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా హాస్టల్స్‌ను మూసివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

హాస్టల్ యజమానులతో సమావేశం కావాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఎన్ఓసీ జారీ చేయలేమని మహేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. 
డీజీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు హాస్టళ్ల యజమానులతో భేటీ అయ్యారు. 

 

click me!