మహిళలను మగపోలీసులు కొట్టారా?: ఏజీపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం

By narsimha lodeFirst Published Jan 17, 2020, 1:13 PM IST
Highlights

అమరావతి పరిసర గ్రామాల్లో ఆందోళనలు చేస్తున్న మహిళలపై మగ పోలీసులు ఎందుకు దాడి చేశారనే విషయాన్ని హైకోర్టు శుక్రవారంనాడుప్రశ్నిించింది.

గుంటూరు:అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని  డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న మహిళలపై పోలీసుల దాడులు, రాజధాని గ్రామాల్లో  144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌ అమలు విషయమై గంట పాటు హైకోర్టు శుక్రవారం నాడు విచారించింది. 

Also read: జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ: తేలనున్న అమరావతి భవితవ్యం

 రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడుల విషయాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారించింది. ఇవాళ గంటపాటు రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందనే విషయాలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

also read:అమరావతి: విశాఖకు రాజధాని తరలించొద్దంటూ సీఆర్‌డీఏకు రైతుల అభ్యంతరాలు

Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా

ఆందోళనలు చేస్తున్న మహిళల్ని మగ పోలీసులే కొట్లారా అని హైకోర్టు ప్రశ్నించింది.విజయవాడలో ర్యాలీలో పాల్గొన్న 610 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారా అని కోర్టు ప్రశ్నించింది. ట్రాపిక్ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు గాను మహిళలను అరెస్ట్ చేసినట్టుగా ఏజీ కోర్టుకు తెలిపారు. 

ర్యాలీలో పాల్గొన్న 610 మహిళలను ఏ కారణం చేత గుర్తింపు కార్డులు అడిగారని హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ ఇప్పుడు అమలు చేయడం లేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు.

Also read:కరుడుగట్టిన ఉగ్రవాదిలా మారాడు: మందడంలో జగన్‌పై బాబు ఫైర్

Also read:అసెంబ్లీని రద్దు చేయండి, రాజకీయ సన్యాసం: జగన్‌కు బాబు సవాల్

2014 నుండి అమరావతిలో 144 సెక్షన్ అమల్లో ఉన్న విషయాన్ని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైల్ భరో, చలో అసెంబ్లీ, ఛలో కలెక్టరేట్ వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్‌ను కొనసాగించినట్టుగా ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.అంతేకాదు అల్లర్లు జరగకుండా ఉండేందుకు వీలుగా కూడ పోలీసులు రాజధాని గ్రామాల్లో  పోలీసులు పరేడ్ నిర్వహించినట్టుగా ఏజీ హైకోర్టుకు తెలిపారు.

ముందస్తు అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని  అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. మహిళను మగ పోలీసు బూటు కాలితో తన్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు ముందస్తు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఏజీ హైకోర్టును కోరారు.ఈ కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. 


 

click me!