అమరావతి శాసనసభ రాజధాని: తేల్చేసిన జగన్ సర్కార్

Published : Jul 06, 2020, 07:37 PM IST
అమరావతి శాసనసభ రాజధాని: తేల్చేసిన జగన్ సర్కార్

సారాంశం

ఏపీలో మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ వెనకడుగు వేయడం లేదు. అమరావతిని శాసనసభ రాజధానిగా కొనసాగించనుంది. శ్రావణ మాసంలో అమరావతిని శాసనసభగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


అమరావతి: ఏపీలో మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ వెనకడుగు వేయడం లేదు. అమరావతిని శాసనసభ రాజధానిగా కొనసాగించనుంది. శ్రావణ మాసంలో అమరావతిని శాసనసభగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

గత మాసంలో రాజధాని ప్రాంతంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. ఈ పర్యటనపై పలు రకాల ఊహాగానాలు చేలరేగాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ ఈ ప్రాంతానికి చెందిన రైతులు  చేస్తున్న ఆందోళనలు రెండు రోజుల క్రితం 200 రోజులకు చేరుకొన్నాయి. 

also read:టీడీపీ నేతలపై కేసులు, తెర మీదికి బీసీ కార్డు: చంద్రబాబుకు వైసీపీ కౌంటర్ ఇదీ

అయితే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్న తీరును పరిశీలించినట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం నాడు స్పష్టం చేశారు.రాజధానిలో రైతులకు ఇచ్చే భూముల లే అవుట్ లను కూడ త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

రాజధాని ప్రాంతానికి కనెక్టివిటిని కూడ పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు సకాంలో సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేయనుంది ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్టుగా జగన్ ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది. కర్నూల్ లో జ్యూడీషీయల్ రాజధాని, విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో శాసనసభ రాజధానిగా ఏర్పాటు చేస్తామని  జగన్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే