మోకాళ్ళ మీద కూర్చో.. వాసన్నకు దండం పెట్టు.. వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచరుల దాడి

Published : Dec 21, 2021, 08:01 AM IST
మోకాళ్ళ మీద కూర్చో.. వాసన్నకు దండం పెట్టు.. వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచరుల దాడి

సారాంశం

‘అన్నా మీ కాళ్లు పట్టుకుంటా నేను చిన్నప్పటి నుంచి ఆయనకు సేవ చేశా.. పార్టీలో ఏం జరుగుతుందో చెప్పా.. అన్నా.. అన్నా.. నీకు దండం పెడతా.. చెప్పేది విను.. ప్లీజ్.. ప్లీజ్..’ అని కాళ్లావేళ్లా పడినా  సుభాని వినిపించుకోలేదు.  తీవ్ర స్వరంతో దుర్భాషలాడుతూ  గుప్తాను కొట్టారు. ‘చంపేస్తా ఎవరు చెబితే నువ్వు మాట్లాడావ్.. రెండు నిమిషాల్లో నిన్ను ఏసేస్తాం’ అంటూ తీవ్ర స్వరంతో బెదిరించారు.

ఒంగోలు :  ‘మోకాళ్ళ మీద కూర్చో... దండం పెట్టు.. వాసన్నకు (Minister Balineni Srinivasa reddy) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను...’ అంటూ ప్రకాశం జిల్లా ongoleకు చెందిన YCP activist సోమిశెట్టి Subbarao Guptaపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది.  ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియోలు  సోమవారం వెలుగులోకి వచ్చింది.

ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు మాట్లాడుతూ... మంత్రి Kodali Nani, MLAs Ambati Rambabu, Vallabhaneni Vamsi, Dwarampudi Chandrasekhar లపై చేసిన వ్యాఖ్యలతో ఆయనకు బెదిరింపులు అధికమయ్యాయి.  ఒంగోలు  లంబాడిడొంకలోని ఆయన నివాసంపై శనివారం  రాత్రి  కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు  గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

గుంటూరులోని బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆదివారం సాయంత్రం 3.40గంటల సమయంలో ఒక పోలీసు వాహనంతో పాటు మరో ప్రైవేటు వాహనంలో ఆ లాడ్జీ వద్దకు చేరుకున్నారు. సుభానీ అనే వ్యక్తి సుబ్బారావు గుప్తాపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేశారు. తాను మధుమేహంతో బాధపడుతున్నాననీ, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని..తనను వదిలి పెట్టాలని గుప్తా వేడుకున్నా వినిపించుకోకుండా దాడి చేశారు.

‘అన్నా మీ కాళ్లు పట్టుకుంటా నేను చిన్నప్పటి నుంచి ఆయనకు సేవ చేశా.. పార్టీలో ఏం జరుగుతుందో చెప్పా.. అన్నా.. అన్నా.. నీకు దండం పెడతా.. చెప్పేది విను.. ప్లీజ్.. ప్లీజ్..’ అని కాళ్లావేళ్లా పడినా  సుభాని వినిపించుకోలేదు.  తీవ్ర స్వరంతో దుర్భాషలాడుతూ  గుప్తాను కొట్టారు. ‘చంపేస్తా ఎవరు చెబితే నువ్వు మాట్లాడావ్.. రెండు నిమిషాల్లో నిన్ను ఏసేస్తాం’ అంటూ తీవ్ర స్వరంతో బెదిరించారు.

వైసీపీ నేత సుబ్బారావుపై సుభాని వర్గీయుల దాడి: వద్దని చెప్పానన్న మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

సుభానీతో పాటు మరో వ్యక్తి గుప్తాను చొక్కా పట్టుకుని మంచం మీద నుంచి కిందికి లాక్కొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి దండం పెట్టిస్తూ మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పించారు.  మొత్తం ఈ ఉదంతాన్ని చిత్రీకరించారు ఈ వీడియో సోమవారం బయటకు రావడంతో తీవ్ర కలకలం రేపింది.

మతిస్థిమితం లేదనడం సరికాదు..
సుబ్బారావు గుప్త విలేకరులతో మాట్లాడుతూ... ఒంగోలులో తన నివాసంపై జరిగిన దాడితో ఆందోళనకు గురై గుంటూరులోని పద్మశ్రీ లాడ్జిలో తలదాచుకున్నారు. ఒక పోలీసు వాహనంతో పాటు మరో వాహనంలో వచ్చిన సుభానీ, అతని బృందం దాడి చేశారన్నారు. తనకు మతిస్థిమితం లేదని భార్య చెప్పినట్లు.. మంత్రి బాలినేని అంటున్నారని, అది సరికాదు అన్నారు.  తానెప్పుడూ పార్టీకి విధేయుడునని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

కేసు నమోదు..
సుబ్బారావు గుప్తా  నివాసం పై దాడి,  గుంటూరులోని లాడ్జిలో అతన్ని కొట్టిన సంఘటనలపై ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి కేసు నమోదయింది. మొదట సుబ్బారావు భార్య నాగమణి, పిల్లలను ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.  శనివారం రాత్రి ఏం జరిగిందీ.. ఆ ఇంటి మీదకు వచ్చి దౌర్జన్యం చేసిన సంఘటనపై ఆరా తీసి పంపించారు.

ఆ తరువాత సుబ్బారావు గుప్తా నుంచి ఫిర్యాదు స్వీకరించారు. తాను వైకాపా కార్యకర్తను కావడంతో తన ఇంటి పై జరిగిన దాడి విషయంలో మొదట ఫిర్యాదు చేయలేదని.. మరోసారి గుంటూరులో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు.  కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు సంఘటనల పై కేసు నమోదయ్యాయి.

ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు నిరసన…
రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోతుందని  దాడులు, అరాచకాలతో  అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రకాశం జిల్లా పర్చూరులో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. సుబ్బారావు గుప్తా నివాసంపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మామిడిపాక హరిప్రసాదరావు తెలిపారు. 

సుబ్బారావు గుప్తాపై దాడిని ఖండిస్తూ రాత్రి కనిగిరి పట్టణంలో తేదేపా నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీలకతీతంగా ఆర్యవైశ్యులంతా ఏకం కావాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు అరవపల్లి ఆంజనేయులు పిలుపునిచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం