ఉద్యోగుల ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తగ్గకూడదని సీఎం సూచించారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పీఆర్సీ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోపుగా పిట్ మెంట్ ను ఫైనల్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
అమరావతి:ఉద్యోగుల IR కంటే ఫిట్‌మెంట్ తగ్గకూడదని సీఎం YS Jagan సూచించారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy చెప్పారు. సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. నాలుగైదు రోజుల్లో ఆర్ధికేతర అంశాలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకొంటారన్నారు. ఉద్యోగులు నష్టపోకుండా ఉండేలా ఫిట్ మెం ట్ ఉండాలని సీఎం చెప్పారన్నారు. ఉద్యోగులతో నష్టం లేని ప్రతిపాదనలతో రావాలని సీఎం చెప్పారన్నారు. ఉధ్యోగులతో చర్చించి సీఎం వద్దకు అధికారులు వస్తారని చెప్పారు.ఫిట్ మెంట్ పై ఈ నెలాఖరులోపుగా నిర్ణయం తీసుకొంటారని ఆయన చెప్పారు.
ఉద్యోగులు లేవనెత్తిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఉద్యోగులను నష్టపరిచే ఉద్యోగం ప్రభుత్వనికి లేదని ఆయన స్పష్టం చేశారు. పీఆర్సీపై కసరత్తు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో అధికారులు,ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు విడతల వారీగా చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో నిరసన కార్యక్రమాలను ఉద్యోగ సంఘాలు తాత్కాలికంగా వాయిదా వేసుకొన్నాయి. ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ సీఎఎస్ సమీర్ శర్మ బుశారం నాడు సమావేశం కానున్నారు. క్రిస్ మస్ కంటే ముందుగానే ఆర్ధికేతర సమస్యల పరిష్కారం దిశగా సీఎస్ నేతృత్వంలోని అధికారుల బృందం చర్యలు తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏ విడుదల చేస్తూ సోమవారం నాడు ఉత్తర్వుల జారీ చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 2019, జూలై 1 నుంచి డీఏ వర్తించనుంది. ఫలితంగా ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నుంచి జీతంతో డీఏ తీసుకోనున్నారు. డీఏ బకాయిలను 2022 జనవరి నుంచి మూడు విడతలుగా చెల్లిస్తారు.డీఏ ఉత్తర్వులు ఇచ్చినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట రామిరెడ్డి. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.