అన్ని పార్టీలను కలిపేందుకు పవన్ కళ్యాణ్ పొలిటికల్ మేనేజరా అంటూ ఏపీ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. నిన్న ఇప్పటంలో పవన్ కళ్యాణ్ వైసీపీపై చేసిన విమర్శలకు మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటరిచ్చారు.
అమరావతి: YCP వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకుగాను అన్ని పార్టీలను కలిపేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ మేనేజరా అని ఏపీ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి Avanthi Srinivas ప్రశ్నించారు.
ఏపీ రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా తాము వ్యవహరిస్తామని జనసేన చీఫ్ Pawan Kalyan మంగళగిరికి సమీపంలో ఇప్పటం గ్రామంలో సోమవారం నాడు నిర్వహించిన Jana Sena ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సభలో వైసీపీపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు ఇవాళ మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటరిచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో ఉంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ది తెలుస్తుందన్నారు.ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మినహా పవన్ కు ఏం తెలుసునని మంత్రి అడిగారు.
BJPతో పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ ఏం సాధించారని ప్రశ్నించారు. గతంలో TDPతొ పొత్తు నుండి పవన్ కళ్యాణ్ ఎందుకు బయటకు వచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు టీడీపీతో ఎందుకు కలుస్తాను అంటున్నారని పవన్ కళ్యాణ్ అడిగారు.Chandrababuను సీఎంగా చేయడం కోసం పవన్ కళ్యాణ్ పార్టీని పెట్టారా అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ సెటైర్లు వేశారు.పవన్ కళ్యాణ్ కు సినిమాల్లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ తప్పుడు మార్గంలో నడుస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ కు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
Kakinada ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై జనసేన కార్యకర్తలు దాడి చేస్తే వైసీపీ కార్యకర్తలు ప్రతి దాడి చేశారని మంత్రి వివరించారు. అందరూ తన మాదిరిగా ఉండరని ఆయన చెప్పారు.ఈ విషయాలు తెలియకుండా నిన్న సభలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం అర్ధ రహితమన్నారు. తాను ఎలాంటి వ్యక్తో నాగబాబుకు తెలుసునని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.
జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు భారీ సభను నిర్వహించారు. ఈ సభలో వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ది కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తాము వ్యవహరిస్తామని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా టీడీపీతో జనసేన పొత్తుకు సంకేతాలు ఇచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండి పడుతున్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోమవారం నాడు రాత్రి ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. చిరంజీవి లేకుంటే పవన్ కల్యాణ్ అసలు వున్నారా అని నాని ప్రశ్నించారు. మానసిక అత్యాచారం చేసేందుకు మీకు లైసెన్స్ వుందా అని మంత్రి మండిపడ్డారు. దేశ , రాష్ట్ర ప్రయోజనాలని ఉపోద్ఘాతాలు చెబుతున్నారని.. మీ నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేసి పెట్టారని పేర్ని నాని ప్రశ్నించారు.
బీజేపీ, టీడీపీలకు కలిపేందుకు పవన్ ప్రయత్నించారని.. చంద్రబాబు, పవన్ ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారని మంత్రి నిలదీశారు. వెల్లంపల్లి వెల్లుల్లి, ర్యాంబో రాంబాబు అంటూ మీరు మాట్లాడొచ్చా అంటూ పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఆడ, మగ తేడా లేకుండా మీరు మానసిక అత్యాచారం చేయొచ్చా అని మంత్రి నిలదీశారు.