భార్యను హోటల్ గదికి తీసుకెళ్లి.. దారుణంగా హత్య చేసిన భర్త...

Published : Mar 15, 2022, 10:17 AM IST
భార్యను హోటల్ గదికి తీసుకెళ్లి.. దారుణంగా హత్య చేసిన భర్త...

సారాంశం

చక్కగా సాగుతున్న కాపురంలో అనుమానం చిచ్చు రేపింది. భార్యాభర్తలు విడిగా ఉంటున్నా ఆ అనుమానం తగ్గలేదు. దీంతో భార్యను మాట్లాడుకుందాం రమ్మంటూ హోటల్ గదికి పిలిచాడు. ఆ తరువాత ఆమెను దారుణంగా హత్య చేశాడు.

విజయవాడ : మాట్లాడుకుందాం రమ్మంటూ నమ్మకంగా hotelకు పిలిచి భార్యను murder చేసిన ఘటన గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం midnight చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్లకు చెందిన షారోన్ పరిమళకు 2015లో అదే మండలం వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల ప్రసాదరావుతో వివాహమైంది. కొంత కాలం వీరి దాంపత్యం సక్రమంగానే సాగింది. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ప్రసాద్ రావు తరచూ ఆమెను అనుమానించడం, అక్రమ సంబంధాలు అంటకట్టడం, మానసికంగా, శారీరకంగా వేధింపులకు చేయడం ప్రారంభించాడు.

ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టారు. తనను బాగా చూసుకుంటానని పెద్దలకు చెప్పి కాపురానికి తీసుకెళ్లాడు. కొద్ది రోజుల తర్వాత యధావిధిగా వేధింపులు ప్రారంభించాడు. ఈ విషయమై షారోన్ పరిమళ గతేడాది అక్టోబర్ నెలలో కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై పోలీసులు 498సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఆమె విజయవాడలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ప్రసాద్ రావు ఆ తర్వాత దుబాయి వెళ్లి ఈ ఏడాది జనవరిలో తిరిగివచ్చాడు. 

హోటల్ గదిలో హత్య...
ఆదివారం రాత్రి 10గంటల సమయంలో తాము భార్యభర్తలమని చెప్పి ప్రసాదరావు, షారోన్ పరిమళ విజయవాడ బస్టాండ్ సమీపంలోని అశోక హోటల్ రూం తీసుకున్నారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో జ్యూస్ తేవడానికి అని చెప్పి ప్రసాదరావు బయటకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ వెంటనే భార్యకు జ్యూస్ నచ్చలేదని చెప్పి అతను మళ్లీ బయటకు వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో హోటల్ రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న కె. సుధాకర్ రెడ్డి ప్రసాదరావుకు ఫోన్ చేశాడు. వెంటనే వస్తానని ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి ఉదయం 5.30 గంటల సమయంలో వారు తీసుకున్న 402 నంబరు గదిలోకి వెళ్లాడు. 

బెడ్ మీద కప్పి ఉంచిన దుప్పటి తొలగించి చూడగా మెడ మీద గాయంతో మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే గవర్నర్ పేట సీఐకి సమాచారం అందించారు. జ్యూస్ కోసమని చెప్పి వెళ్లిన ప్రసాదరావు అదే రోజు రాత్రి 3 గంటల ప్రాంతంలో కంచికచర్ల పోలీసుల ఎదుట లొంగిపోయారు. హోటల్ లో తన భార్య షారోన్ ను హత్య చేసినట్లు చెప్పడంతో వారు హోటల్ కు, గవర్నర్ పేట పోలీసులకు సమాచారం అందించారు. రిసెప్షనిస్ట్ ఇచ్చిన ఫిర్యాదుపై గవర్నర్ పేట పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కేసు విషయం మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిచి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన..
కంచికచర్ల : విజయవాడలోని హోటల్ గదిలో హత్యకు గురైన మహిళ బంధువులు, కుటుంబసభ్యులు కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిని, అతడి తల్లిదండ్రులు కుటుంబసభ్యులను అరెస్ట్ చేసి, విచారిస్తున్నామని, ఆందోళన వద్దని పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu