జంగారెడ్డిగూడెం మరణాలు: చర్చ కోరుతూ ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసన

By narsimha lode  |  First Published Mar 15, 2022, 9:54 AM IST

జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ చేపట్టాలని ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు కూడా టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. అయతే ప్రతి రోజూ టీడీపీ సభ్యులు డ్రామాలు చేస్తున్నారని వైసీపీ విమర్శలు చేసింది.


అమరావతి: Jangareddy Gudem  మరణాలపై ప్రత్యేక చర్చ చేపట్టాలని మంగళవారం నాడు కూడీTDP సభ్యులు నిరసనకు దిగారు. సోమవారం నాడు కూడా ఇదే విషయమై టీడీపీ సభ్యులు నిరసనకు దిగడంతో ఐదుగురు టీడీపీ సభ్యులను ఈ సమావేశాలు పూర్తయ్యేవరకు కూడా సస్పెండ్ చేశారు.

ఇవాళ ఉదయం  AP Assembly శాసనసభ ప్రారంభం కాగానే జంగారెడ్డి గూడెం మరణాలపై ప్రత్యేక చర్చ చేపట్టాలని కోరుతూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. Illicit liquor మరణాలన్నీ ప్రభుత్వ హత్యలంటూ నినాదాలు చేశారు.  మద్యపాన నిషేధం ఎత్తివేయాలని ప్ల కార్డులు ప్రదర్శించారు. 

Latest Videos

undefined

టీడీపీ సభ్యుల నిరసనలపై అధికార YCP సభ్యులు మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని  ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ Srikanth Reddy  మండిపడ్డారు. రోజూ సభ ప్రారంభం కాగానే రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలపై ఆయన మండిపడ్డారు.  ఇదే విషయమై ఏపీ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి Buggana Rajendranath Reddy  జోక్యం చేసుకొన్నారు. 

ప్రశ్నలకు సమాధానాలు వినే ఓపిక కూడా టీడీపీ సభ్యులకు లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు. ప్రతిపక్షం లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో అన్నీ వెన్నుపోటు పథకాలేనని మంత్రి బుగ్గన దుయ్యబట్టారు

శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోంది. సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారు. శవ రాజకీయాలను టీడీపీ ఇంకెన్ని రోజులు చేస్తోందని YSRCP MLA జోగి రమేష్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.

జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాలపై సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా ఏపీ అసెంబ్లీలో ప్రకటన చేశారు. సహజ మరణాలను కూడా టీడీపీ వక్రీకరిస్తుందని మండి పడ్డారు. టీడీపీవి శవ రాజకీయాలు అంటూ విమర్శలు చేశారు.

జంగారెడ్డి గూడెంలో ఇటీవల కాలంలో మరణించిన కుటుంబ సభ్యులను టీడీపీ చీఫ్ చంద్రబాబు సోమవారం నాడు పరామర్శించారు. ఇటీవల కాలంలో  జంగారెడ్డిగూడెంలో వరుసగా మరణాలు చోటు చేసుకొన్నాయి. అయితే వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకొన్న మరణాలకు పలు కారణాలున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల మరణాలు కూడా చోటు చేసుకొన్నాయని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో దాదాపు 10 మంది క‌ల్తీ సారా తాగ‌డం వ‌ల్ల‌నే చనిపోయార‌నే ప్రచారం కూడా లేకపోలేదు. 

ఈ మరణాలపై  ద‌ర్యాప్తు నిర్వ‌హించ‌డానికి ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ హైమావ‌తి విజ‌య‌వాడ జీజీహెచ్ డాక్ట‌ర్ల టీమ్  జంగారెడ్డి గూడెనికి  చేరుకుంది. మృతుల కుటుంబాల ఇళ్ల‌కు ఈ టీం వెళ్లింది. మృతుల కుటుంబాల నుండి  వివ‌రాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది. మృతి చెందిన వారిలో ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అల‌వాటు ఉంద‌ని చెప్పారు. ఇందులో ప‌లువురు ధీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధప‌డుతున్న వారు కూడా ఉన్నార‌ని తెలిపారు. మ‌రి కొంద‌రు 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఉన్నార‌ని పేర్కొన్నారు. 

ఈ మ‌ర‌ణాల నేప‌థ్యంలో ప‌లువురు అధికారులు  స‌స్పెన్ష‌న్ కు గుర‌య్యారు. గురువారం ఒక‌రు హాస్పిట్  ల‌కు వెళ్లిన కొంత స‌మ‌యానికి మృతి చెందారు. అయితే ఆయ‌న మృత‌దేహానికి పోస్టు మార్టం చేయ‌లేదు. ఇలా మృతి చెందిన వారెవ‌రికీ పోస్టు మార్టం నిర్వ‌హించ‌లేదు. దీంతో అస‌లు మ‌ర‌ణాలు ఏ కార‌ణంతో సంభ‌విస్తున్నాయ‌నే అంశంపై ఓ క్లారిటీకి రాలేక‌పోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు. 

జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ చేపట్టాలని టీడీపీ నిన్నటి నుండి పట్టుబుడుతుంది.  చర్చ కోరుతూ  టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ నిరసనకు దిగుతున్నారు. దీంతో సభ నుండి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుండి సస్పెండ్ కావాలనే ఉద్దేశ్యంతోనే టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని వైసీపీ ప్రజా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు.

click me!