మిమ్మల్ని మీ నేతలే నమ్మడం లేదు: లోకేష్ పై మంత్రి సెటైర్లు

Published : Oct 30, 2020, 05:14 PM IST
మిమ్మల్ని మీ నేతలే నమ్మడం లేదు: లోకేష్ పై మంత్రి సెటైర్లు

సారాంశం

పోలవరం నిర్మాణంలో ఇబ్బందులకు టీడీపీయే కారణమని ఏపీ మంత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శుక్రవారం నాడు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.  టీడీపీ నేతల మాదిరిగా తాము టూరిస్టు నేతలం కాదన్నారు. నిత్యం తాము ప్రజల మధ్య ఉంటామన్నారు.


నెల్లూరు: పోలవరం నిర్మాణంలో ఇబ్బందులకు టీడీపీయే కారణమని ఏపీ మంత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శుక్రవారం నాడు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.  టీడీపీ నేతల మాదిరిగా తాము టూరిస్టు నేతలం కాదన్నారు. నిత్యం తాము ప్రజల మధ్య ఉంటామన్నారు.

తన రెక్కల  కష్టంతో జగన్  వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చాడని ఆయన గుర్తు చేశారు. మీ లాగా.. మీ నాన్న లాగా దొంగచాటుగా అధికారంలోకి రాలేదని  లోకేష్ పై మంత్రి విమర్శలు గుప్పించారు.

also read:వరి చేనుకి, చేపల చెరువుకి తేడా తెలియదు: లోకేష్‌పై కొడాలి నాని సెటైర్లు

మీ పార్టీ నేతలే నిన్ను నమ్మే పరిస్థితులో లేరని మంత్రి లోకేష్ పై విమర్శించారు. రాష్ట్ర పప్పు మారాజ్ లోకేష్ అంటూ ఆయన సెటైర్లు గుప్పించారు. మిడి మిడి అవగాహనతో లోకేష్ మాట్లాడుతున్నారని మంత్రి చెప్పారు.

రైతులను జైలుకు పంపిన చరిత్ర మీ నాన్నదేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏనాడూ కూడ ప్రజల గురించి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu